పెట్టుబడులు ఏమో గాని వస్తున్న పరిశ్రమల వల్ల చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు అనేక ఇబ్బందులు దేశవ్యాప్తంగా కొన్ని సంఘటనల వల్ల ఎదుర్కొంటున్నారు. కనీస జాగ్రత్తలు పాటించకుండా లాభమే అన్నట్టు వ్యవహరిస్తున్న కంపెనీలు దేశంలో కోకొల్లలు. అయినా గాని వాటిపై చర్యలు తీసుకోవడం లేదు ప్రభుత్వాలు. పరిశ్రమ ఉందంటే దాని చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని భయంగా బతకాల్సిన పరిస్థితి ప్రస్తుతం ఏర్పడింది. పరిశ్రమ యాజమాన్యాలు తీసుకోవలసిన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ప్రాణాల మీదకు తీసుకు వస్తున్నాయి.

 

చాలావరకు కంపెనీలు గ్రామీణ ప్రాంతాల్లో నగర శివారులో ఉంటుంటాయి. ఈ సమయంలో ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి జాగ్రత్తలు తీసుకోవాలి అయితే అటు వంటివి ఏమీ లెక్కచేయడం లేదు. అయితే జగన్ ముఖ్యమంత్రి కాకముందే ప్రతిపక్షంలో ఉన్న సమయంలోనే తూర్పుగోదావరి జిల్లాలో ongc కంపెనీ వల్ల చాలా బాగా నష్టం జరిగింది. ఆ సమయంలోనే జగన్ పరిశ్రమల విషయంలో చాలా నిక్కచ్చిగా మాట్లాడటం జరిగింది.

 

ఈ తరుణంలో ప్రస్తుతం ఆయన అధికారంలోకి రావడంతో విశాఖపట్టణంలో ఎల్జీ పాలిమర్స్ కంపెనీ చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో కేంద్రం సపోర్టుతో జగన్ ఇమీడియట్ చర్యలు తీసుకోవడానికి రెడీ అవుతున్నారు. ముఖ్యంగా గ్రామాల నుంచి వెళ్లే గ్యాస్ పైపుల విషయంలో కంపెనీ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఇమీడియట్ గా చర్యలు తీసుకోవాలని కేంద్రం జగన్ కి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మొత్తంమీద చూసుకుంటే కంపెనీ నుంచి నివేదిక అందిన తర్వాత జగన్ యాక్షన్ చర్యలు గట్టిగానే ఉండబోతుందట వార్తలు వస్తున్నాయి. దేశంలో మరి ఏ రాష్ట్రంలో ఇటువంటి సంఘటనలు జరగకుండా జగన్ మరియు కేంద్రం చర్చించి ఒక సంచలన నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి జగన్ ఎటువంటి యాక్షన్ తీసుకుంటారో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: