వైరస్ వచ్చిన నాటి నుండి చాలా వరకు రాష్ట్రాలలో అధికార ప్రతిపక్ష పార్టీలు కలిసి పని చేస్తున్నాయి. ఏ మాత్రం రాజకీయాలు చేయటం లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం ప్రతిపక్షాలు టిడిపి జనసేన మరికొన్ని పార్టీలు రాజకీయ విమర్శలు చేస్తూనే ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మొదట సైలెంట్గా ఉన్న తాజాగా ప్రతిపక్షాలు విమర్శలు చేయటం స్టార్ట్ చేశారు. మొన్నటి వరకు చాలా సైలెంట్ గా ఉన్న దశలో తాజాగా తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ ని ఉద్దేశించి ప్రభుత్వం పై అనేక ఆరోపణలు మరియు డిమాండ్ లు చేస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే తెలంగాణ జన సమితి పార్టీ అధ్యక్షుడు కోదండరాం ఆధ్వర్యంలో జరిగిన పార్టీ సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం పై విమర్శలు చేయటం మొదలుపెట్టారు.

 

తెలంగాణ రాష్ట్రంలో మద్యం దుకాణాలు ఓపెన్ చేయటాన్ని తప్పుబడుతూ తెలంగాణ సీఎం పై విమర్శలు చేశారు. వివిధ పార్టీల నాయకుల సమావేశాల్లో కూడా మద్యం దుకాణాలకు కేసిఆర్ పర్మిషన్ ఇవ్వడం పై విమర్శలు చేస్తున్నారు. ఇటువంటి సమయంలో మద్యం తాగి మందు బాబులు గృహహింస, అత్యాచారాలు చేసే అవకాశం ఉందని అలాంటి  ఘటనలు జరుగుతాయని దానికి ప్రభుత్వం బాధ్యత వహించాలని అన్నారు. అదేసమయంలో ఈ నెల 11 వ తేదీన భవన నిర్మాణ కార్మికులు 10 వేల చొప్పున ఆర్థిక సాయం అందజేయాలని కాని పక్షంలో 12 వ తారీఖున లేబర్ ఆఫీస్ ముందు ధర్నా చేపడతామని పేర్కొన్నారు.

 

అయితే ఈ సమయంలో విపక్ష పార్టీలు అన్ని కేవలం ప్రభుత్వంపై విమర్శలు చేయడాన్ని చూస్తున్న కేసీఆర్...అసలు ఇప్పటి వరకు ఆదాయం లేకుండా ప్రభుత్వ ఖజానా ఉంటే తెలిసీ కూడా వీళ్లు ప్రభుత్వాన్ని విమర్శించడాన్ని బట్టి నవ్వుతున్నారు. ఈ సమయంలో కేంద్రాన్ని ప్రశ్నించాలి గాని ప్రభుత్వంపై విమర్శలు చేయడం ఏంటి అని కేసీఆర్ పార్టీ నేతలతో అన్నారట.  

మరింత సమాచారం తెలుసుకోండి: