మామూలుగా సమాజంలో ఒక రాజకీయ నాయకుడు లేకపోతే సెలబ్రిటీ చనిపోతే ఆ వార్త సంచలనం అవుతుంది చాలా వరకూ అందరూ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వాళ్లు చేసిన పనులు ఎలా ఉన్నా ఎక్కువశాతం జనాలు అయ్యో అతను చనిపోయాడా అని అంటుంటారు. అటువంటిది దేశంలో ఒక వ్యక్తి సెలబ్రిటీ కాదు మరియు రాజకీయ నాయకుడు కూడా కాదు అతని మరణవార్త విని చాలా మంది అయ్యో అని తెగ బాధపడుతున్నారు. ఎప్పుడూ ఒంటిమీద కేజీల కేజీల బంగారం ధరిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తూ నిలిచే పూణే వ్యాపారి 39 ఏళ్ల సమ్రాట్ మోఝే ఆకస్మికంగా మరణించారు. బతికున్నంత కాలం గోల్డ్ మ్యాన్ గా బతికేసిన ఆయన మరణం గురించి తెలిసిన వారంతా ఆయ్యో అనకుండా ఉండలేక పోతున్నారు.

 

బంగారం అంటే తెగ ఇష్టపడే సామ్రాట్ తక్కువ తక్కువగా ఒంటిమీద 8 నుంచి 10 కిలోల బంగారాన్ని ఎప్పుడూ ధరించేవారు. తన తల్లి మరియు భార్య పిల్లలు ఉన్న అతి తక్కువ వయస్సులోనే గుండెపోటు గురయి మరణించడంతో హుటాహుటిన ఆయనను ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఎంత ప్రయత్నించినా ఆయన ప్రాణాలు కాపాడలేకపోయారు. బతికున్నంత కాలం గోల్డ్ మ్యాన్ అనే పేరు సంపాదించిన ఎప్పుడు హడావిడి చేసి వార్తల్లో నిలిచిన చివరిలో ఆయన అంత్యక్రియలు చాలా దయనీయంగా జరిగాయి.

 

లాక్ డౌన్ టైం కావటంతో ఎంతో పేరు ప్రతిష్ట ఉన్నా గోల్డ్ మ్యాన్ అంత్యక్రియలు 20 మంది సభ్యుల మధ్య జరగటం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఒంటి నిండా అంత బంగారం ఉన్నాగాని మరణించిన సమయంలో ఏమి తీసుకోలేని సామ్రాట్ నీ చూసి చాలామంది అయ్యో అని అన్నారు. ఎంత బంగారం ఉంటే ఏం లాభం భూమి నుండి ఏమీ తీసుకోలేదు సామ్రాట్ అని చాలామంది ఆయన మరణవార్త విని వ్యాఖ్యానిస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: