దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి వేగంగా విజృంభిస్తోంది. కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. దేశంలో మహారాష్ట్రలో అత్యధికంగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఈరోజు ఉదయం వరకు మహారాష్ట్రలో 18,120 కేసులు నమోదయ్యాయి. లాక్ డౌన్ విధించినప్పటి నుంచి ఇప్పటివరకు 557 మంది పోలీసులకు కరోనా నిర్ధారణ అయింది. మహారాష్ట్ర హోం మంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్ స్వయంగా ఈ విషయాలను వెల్లడించారు. 
 
గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో 1362 కొత్త కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 694 మంది కరోనా భారీన పడి మృతి చెందారు. కరోనా కట్టడి కోసం కృషి చేస్తున్న పోలీసులే ఆ వైరస్ భారీన పడుతున్నారు. అనిల్‌ దేశ్‌ముఖ్ ముంబైలో ఇప్పటివరకు 2,26,236 మందిని క్వారంటైన్ లో ఉంచగా 653 మంది రూల్స్ బ్రేక్ చేశారని చెప్పారు. వలస కూలీల కోసం రిలీఫ్ క్యాంప్స్ ఏర్పాటు చేశామని 4,28,734 మంది క్యాంప్స్ లో ఆశ్రయం పొందుతున్నారని అన్నారు. 
 
ఇప్పటివరకు పోలీస్ హెల్ప్ లైన్ కు 86,246 కాల్స్‌ వచ్చాయని తెలిపారు. రాష్ట్రంలో 3,15,434 మందికి ఎమర్జెన్సీ పాసులు జారీ చేశామని పేర్కొన్నారు. రాష్ట్రంలో 98,774 కేసులు నమోదు చేశామని అన్నారు. ఇప్పటివరకు 54,148 వాహనాలను సీజ్ చేశామని పేర్కొన్నారు. కరోనాను కట్టడి చేయడం కోసం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కొత్త కేసులు నమోదు కాకుండా లాక్ డౌన్ నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. 
 
మరోవైపు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో వైరస్ వేగంగా విజృంభిస్తోంది. రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 54 కొత్త కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఈరోజు ఉదయం వరకు 1887 కరోనా కేసులు నమోదు కాగా 41 మంది మృతి చెందారు. రాష్ట్రంలో కర్నూలు జిల్లాలో అత్యధికంగా 547 కరోనా కేసులు నమోదు కాగా విజయనగరం జిల్లాలో అత్యల్పంగా 4 కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో నిన్న 15 కొత్త కేసులు నమోదు కావడంతో కరోనా బాధితుల సంఖ్య 1122కు చేరింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: