దేశంలో ఇప్పుడు కరోనా భయంతో లాక్ డౌన్ కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. అయితే కరోనా మహ్మారి కేసులు, మరణాలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి.  కరోనా నిర్మూలించాలంటే సాధ్యమైనంత వరకు సామాజిక దూరం, మాస్క్ లు ధరించాలని.. కరోనా రోగి అని అనుమానం వస్తే వెంటనే దగ్గరలోని వైద్యులకు సమాచారం ఇవ్వాలని చెబుతున్నారు.  ఒకదశంలో కరోనా కేసుల బయానికి మనిషిన చూసి మనిషి భయపడిపోతున్నారు.  ఇలాంటి సందర్భంలో కూడా కొంత మంది కామాంధులు రెచ్చిపోతున్నారు. ఆడది అని తెలిస్తే చాలు.. చిన్నా పెద్దా అనే తారతమ్యాలు లేకుండా అత్యాచారాలకు తెగబడుతున్నారు.  

 

యూపీ మహారాజ్ గంజ్ లోని కొల్హి ప్రాంతంలో దారుణం చోటు చేసుకుంది.  ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు కామాంధుడు.  ఇంటి బయట ఆడుకుంటున్న చిన్నారిని.. విక్రమ్ అనే వ్యక్తి ఎత్తుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడని ప పోలీసులు తెలిపారు. బాలిక ఇంటి దగ్గర్లో నివాసం ఉండే విక్రమ్.. చాక్లెట్లు కొనిస్తానని ఆశపెట్టి చిన్నారిని తీసుకెళ్లి దారుణానికి ఒడిగట్టినట్లు పేర్కొన్నారు.  ఆ చిన్నారి తెల్లవారే సరికి అనారోగ్యానికి గురి కావడంతో  విషయం బయటపడిందని, తల్లిదండ్రుల కంప్లైంట్ మేరకు నిందితుడ్ని అరెస్టు చేసి కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

 

బాలికను వైద్య పరీక్షల కోసం పంపించామని, ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఇదిలా ఉంటే రాజస్థాన్‌లోని టోంక్ జిల్లాలో ఓ బాలికపై గ్యాంగ్ రేప్ కి పాల్పపడ్డారు. గ్యాంగ్ రేప్ ఘటన నిందితులను అరెస్టు చేసినట్లు అక్కడి పోలీసులు శుక్రవారం వెల్లడించారు. ముగ్గురు నిందితుల్ని అరెస్టు చేశామని, మరొకరిని పట్టుకుంటామని టోంక్ జిల్లా పోలీసులు మీడియాకు తెలిపారు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నలుగురు నిందితులపై కిడ్నాప్, సామూహిక అత్యాచారం కేసు ఫైల్ చేసినట్లు వెల్లడించారు. ప్రస్తుతం కరోనా సమయంలో ఇలాంటి దారుణలు జరగడం శోోచనీయం. 

మరింత సమాచారం తెలుసుకోండి: