కడప జిల్లాలోని జమ్మలమడుగు లో అర్ధరాత్రి రెండు గంటల సమయంలో భయంకరమైన సంఘటన చోటు చేసుకుంది. పట్టణంలోని జనరల్ స్టోర్ లోకి గుట్టుచప్పుడు కాకుండా ప్రవేశించిన ఇద్దరు దొంగలు దుకాణం లోని డబ్బులను దొంగలించి పారిపోయేందుకు ప్రయత్నించారు. ఆ క్రమంలోనే దొంగల చేసే శబ్దాన్ని విన్న జనరల్ స్టోర్ యజమాని ఉమా మహేశ్వరరావు హుటాహుటిన అక్కడికి వచ్చి దొంగలను అడ్డుకునేందుకు ప్రయత్నించాడు. కానీ దొంగల చేతిలో ఒక కత్తి ఉండడం తో వారు అతడి గొంతు కోసి అక్కడి నుంచి ఉండాయించారు.


ఐతే పట్టణం లో దొంగతనం జరిగిన విషయం తెలుసుకున్న జమ్మలమడుగు పోలీసులు చోరీ కాబడిన జనరల్ స్టోర్ లో వస్తువులను పరిశీలించారు. అనంతరం దొంగతనం చేసిన వ్యక్తులను నరసయ్య, దస్తగిరి రెడ్డిగా గుర్తించారు. ఉమా మహేశ్వరరావు గొంతుకోసి పారిపోయే క్రమంలో ఒక దొంగ కిందపడి గాయపడ్డట్టు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతానికి కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ సంఘటనపై మరింత దర్యాప్తు చేస్తున్నారు. గాయపడ్డ ఎజమాని ఉమామహేశ్వరరావు పరిస్థితి నిలకడగా ఉందని తెలుస్తోంది.


ప్రస్తుతం కరోనా వైరస్ పై పోరు చేస్తున్న ప్రభుత్వ యంత్రాంగాలు పోలీసుల అధికారుల చేత రాత్రి సమయాల్లో కర్ఫ్యూ నడిపిస్తున్నారు. అయినా కూడా పోలీసుల కళ్ళు కప్పి దొంగలు చోరీలకు పాల్పడుతున్నారు. కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు భారత దేశ వ్యాప్తంగా దొంగలు తమ పని కానిచ్చేస్తున్నారు. కొన్ని వారాల క్రితం మద్యం దొంగలు కూడా తెగ రెచ్చిపోయారు. బంగారపు దుకాణాల్లో కూడా భారీ చోరీలు లాక్ డౌన్ నిబంధనలు కొనసాగుతుండగానే జరగడం గమనార్హం.


ఇకపోతే రాత్రి సమయాల్లో ప్రయాణాలు చేస్తున్న సామాన్య ప్రజలను కూడా దొంగలుగా భావిస్తున్న గ్రామస్తులు దాడులకు ఒడిగడుతున్నారు. ఇటీవల ఏ పాపం తెలియని దంపతులను దొంగలుగా భావించినా కొందరు వారిని అతి కిరాతకంగా కొట్టి చంపేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: