హైద‌రాబాద్ జ‌నం లాక్‌డౌన్‌ను తూచ్ అనేస్తున్నారు. సుధీర్ఘ‌కాలంగా ఇళ్ల‌కే ప‌రిమిత‌మ‌వుతూ వ‌స్తున్న జ‌నం శుక్ర‌వారం మాత్రం పెద్ద సంఖ్య‌లో వాహ‌నాల‌తో రోడ్ల‌పైకి చేరుకోవ‌డం గ‌మ‌నార్హం. అత్య‌వ‌స‌ర‌మైతే త‌ప్పా రోడ్ల‌పైకి రావ‌ద్ద‌ని భాగ్య‌న‌గ‌ర వాసుల‌కు ప్ర‌భుత్వం హెచ్చ‌రించినా పెడ‌చెవిన పెట్టేశారు. రాష్ట్రంలోని చాలా జిల్లాలు గ్రీన్‌, ఆరెంజ్ జోన్ల‌లో ఉన్న విష‌యం తెలిసిందే. అయితే జీహెచ్ఎంసీ ప‌రిధిని  రెడ్‌జోన్‌గానే ప‌రిగ‌ణిస్తున్నారు.ఆయా సంస్థ‌లు, అవ‌స‌రాల నిమిత్తమే బ‌య‌ట‌కు రావాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం సూచించినా జ‌నం ప‌ట్టించుకోవ‌డం లేదు. 

 

తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం లాక్‌డౌన్ కొనసాగిస్తున్న‌ప్ప‌టికీ అనేక ఆంక్ష‌ల‌తో దుకాణాల‌ను, మ‌ద్యం అమ్మ‌కాల‌కు పచ్చ‌జెండా ఊపింది. అయితే సామాజిక దూరం పాటించాల‌ని సూచించింది. అయితే హైద‌రాబాద్‌లో కూడా రవాణా, రిజిస్ట్రేషన్‌ శాఖలతోపాటు నిర్మాణ రంగానికి ప్రభుత్వం వెసులుబాటు కల్పించిన విషయం తెలిసిందే. ఐటీ ఉద్యోగులు సైతం 33 శాతం మంది కార్యాలయాలకు వెళ్లేలా అనుమ‌తులిచ్చింది. ఇక నిర్మాణ రంగానికి సంబంధించిన దుకాణాలు తెరచుకున్నాయి. దీంతో ఇలా ప‌ని మీద బ‌య‌ట‌కు వ‌చ్చేవారితో క‌లిపి అవ‌స‌రం లేకున్నా..ప‌నికి వెళ్ల‌కుండా ఉన్న వారు సైతం రోడ్ల‌పైకి చేరుకోవ‌డం క‌నిపించింది. అయితే ఇలాంటి వాహ‌న‌దారుల‌ను గుర్తిస్తున్న పోలీసులు భారీగా జ‌రిమానాలు విధిస్తున్నారు.


అయితే లాక్‌డౌన్‌ సడలింపులతో గత రెండు రోజుల నుంచి నగరంలో వాహనాల రాకపోకల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇదిలా ఉండ‌గా  రాష్ట్రంలో రోజురోజుకు కరోనా ఉధృతి తగ్గుతున్నట్లు క‌నిపిస్తోంది. వారం రోజులుగా కేసుల సంఖ్య  తక్కువ‌గా న‌మోదవుతోంది. రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ  విడుద‌ల చేసిన హెల్త్ బులిటెన్ ప్ర‌కారం.. రాష్ట్రంలో శుక్ర‌వారం కేవలం 10 పాజిటివ్ కేసులే నమోదయ్యాయి. ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం కేసుల సంఖ్య 1132కి చేరుకుంది. శుక్ర‌వారం ఒక్కరోజే ఇవాళ 34 మంది డిశ్చార్జ్‌ అయ్యారని.. ప్రస్తుతం గాంధీ ఆస్పత్రిలో 376 మందికి చికిత్స తీసుకుంటున్నారని ఆరోగ్య‌శాఖ మంత్రి ఈటెల రాజేంద‌ర్ తెలిపారు. 

 


క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: