రాజకీయంగా వైయస్ జగన్ రోజురోజుకీ పరిణితి చెందుతున్నారు. ఎన్ని దెబ్బలు ఆటుపోట్లు తగిలిన వాటిని భరిస్తూనే పాఠాలు నేర్చుకుంటూ అద్భుతమైన సంక్షేమ పరిపాలన ఏపీ ప్రజలకు అందిస్తున్నారు. అనుభవం లేని జగన్ పరిపాలన అంతగా ఏమీ ఉండదని ప్రత్యర్థులు మొదటిలో భావించడం జరిగింది. కానీ ఊహించని విధంగా కష్టాలు తాను పడుతూనే మరోపక్క ప్రజల కష్టాలను తెలుసుకుంటూ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో రాష్ట్రం మొత్తం జరగడంతో ఒక అవగాహనకు వచ్చేశారు. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన అప్పటి నుండి జగన్ తనదైన శైలి నిర్ణయాలతో పారదర్శక పరిపాలన అందిస్తూ ముందుకు దూసుకుపోతున్నారు. అమలు చేస్తున్న పథకాలు మరియు పరిపాలన తెలుగుదేశం పార్టీ షాకుల మీద షాకులు ఇస్తున్నట్లు ఉంది. ఈ నెలతో జగన్ పరిపాలన ఏడాది పూర్తి కాబోతుంది.

 

ఈ ఏడాది పరిపాలనలో జగన్ మోహన్ రెడ్డి అనుభవం లేని పరిపాలన అంతంత మాత్రం గా ఉంటుందనుకున్న వారికి అంతా రివర్స్ అయ్యింది. వైయస్ జగన్ తనదైన శైలిలో నిర్ణయాలు పథకాలు అమలు చేస్తూ ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ఆర్థిక రంగం లోటు లో ఉన్నప్పటికీ ఎక్కడా కూడా వెనుకడుగు వేయకుండా ప్రతి హామీని నెరవేరుస్తూన్నారు. ‘వైఎస్సార్ రైతు భరోసా’ పథకం కింద రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతు కుటుంబానికి 12,500 రూపాయలు ఇచ్చారు. పెన్షన్లను దశలవారీగా ఇచ్చిన మాట ప్రకారం పెంచుకుంటూ పోతున్నారు. ఆశా వర్కర్ల జీతాలు మూడు వేల నుండి పదివేల వరకు చేశారు. అంగన్ వాడి కార్యకర్తలు జీతాలు 11.500కు పెంచారు. పారిశుద్ధ్య కార్మికుల జీతాలు ఏకంగా 18 వేలకు పెంచారు. అమ్మ ఒడి పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్నారు.

 

ఇక పేద వారికి ఇళ్ల పట్టాల కార్యక్రమం కరోనా కార్యక్రమం పూర్తయ్యాక వైయస్సార్ పుట్టినరోజు నాడు జూలై 8 వ తారీఖున పంపిణీ చేయడానికి రెడీ అవుతున్నారు. ఇక కరోనా వైరస్ తో ఏ రాష్ట్రం పోరాడాని విధంగా జగన్ సర్కార్ గట్టిగా పోరాడింది. దేశంలో ఏ రాష్ట్రం జరపని కరోనా వైరస్ పరీక్షలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిపి సమర్థవంతంగా ఎదుర్కొంది. మరోపక్క చంద్రబాబు మరియు మిగతా పార్టీల నాయకులు ఎన్ని కుట్రలు పన్నినా వాటిని ధీటుగా ఎదుర్కొంటూ వాళ్లు వేస్తున్న ఎత్తుగడలకు చెక్ పెడుతూ జగన్ తన పరిపాలనలో దూసుకుపోతున్నరు. మొత్తం మీద ఈ ఏడాది పరిపాలనలో ప్రత్యర్థులకు ఊహించని దెబ్బ కొట్టారు జగన్. 

మరింత సమాచారం తెలుసుకోండి: