విశాఖపట్నం జిల్లాలో వెంకటాపురం సమీపంలో గ్యాస్ లీక్ కావడంతో కొన్ని మరణాలు సంభవించడం మనకందరికీ తెలిసిందే. ఈ సందర్భంలో ఆ ప్రాంతంలో ఉన్న యువకులు మరియు పోలీస్ గ్యాస్ ప్రమాదకర స్థాయిలో లీక్ అవుతున్న టైంలో హుటాహుటిన అలర్ట్ అయ్యి చాలా మందిని హాస్పిటల్ కి తీసుకెళ్లడంతో చాలావరకు ప్రాణనష్టం తగ్గింది. వెంటనే కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోవటంతో ఏపీ సీఎం జగన్... అత్యవసరంగా విశాఖపట్టణానికి చేరుకోవడం జరిగింది.

 

ఇటువంటి టైం లో తన క్యాంప్ ఆఫీస్ నుండి విశాఖ బయలుదేరే సమయంలో విజయ సాయి రెడ్డి...జగన్ కారు ఎక్కి వెంటనే దిగిపోవడం తో ప్రత్యర్థులు మరియు ఆయనకు వ్యతిరేకంగా ఉండే మీడియా రకరకాల వార్తలు ప్రసారం చేయడం జరిగింది. విజయసాయి రెడ్డికి కూడా జగన్ ఝలక్ ఇచ్చారని... వెంటనే సాయి రెడ్డి కారు దిగు అని కోపంగా అన్నాడు అని రకరకాల ఇష్టానుసారంగా వార్తలు ప్రచారం చేశాయి. ఇక అసలు విషయానికి వస్తే సీఎం జగన్ కారు ఎక్కిన తర్వాత ముందు నుండి మంత్రి ఆళ్ల నాని సీఎం జగన్ తో మాట్లాడుతుంటే...విజయ సాయి రెడ్డి వెనక డోర్ లో కూర్చుని జగన్ కి ఏదో చెప్పేసి కారు దిగి పోయారు.

 

ఆ తర్వాత సీఎం జగన్ తోనే వెళ్తున్నట్టు విజయసాయిరెడ్డి చెప్పడం ఆయన కూడా ఓకే అని చెప్పడం జరిగింది. ఈ విషయం నడుస్తూ ఉండాగాన్నే విజయసాయి రెడ్డి వ్యవహారం వైజాగ్ లో వైసీపీ వర్గంలో కొంత తల నొప్పిగా ఉండటంతో...జగన్ కావాలని విజయసాయిరెడ్డిని రావొద్దు అన్నట్టుగా పార్టీ లో టాక్ నడుస్తుంది. విజయసాయిరెడ్డి తనతో పాటు వస్తే అగ్గిమీదగుగ్గిలం అయినట్లు ఉంటుందని భావించి జగన్ ఈ విధంగా వ్యవహరించినట్లు వైసీపీ పార్టీలో టాక్. 

మరింత సమాచారం తెలుసుకోండి: