దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తోంది. ప్రతిరోజూ వేల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కరోనాకు వ్యాక్సిన్ కనిపెట్టేందుకు పరిశోధనలు జరుగుతున్నాయి. అయితే కరోనా వైరస్ పుట్టుకకు కారణమైన చైనా తాజాగా ఒక శుభవార్త చెప్పింది. చైనా శాస్త్రవేత్తలు కరోనా వైరస్ కు మందు కనిపెట్టడంలో ముందడుగు వేశామని ప్రకటన చేశారు. డ్రాగన్ శాస్త్రవేత్తలు వ్యాక్సిన్ ను కోతులపై ప్రయోగించామని ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయని చెబుతున్నారు. 
 
బీజింగ్‌కు చెందిన షినోవాక్‌ బయోటెక్ ఈ వ్యాక్సిన్ ను తయారు చేసింది. శాస్త్రవేత్తలు మొదట ఈ వ్యాక్సిన్ ను కోతులపై ప్రయోగించారు. తాజాగా శాస్త్రవేత్తలు కోవిడ్‌-19 వైరస్‌కు దారితీసే సార్స్‌-కోవ్‌-2 ను వాటిలో ప్రవేశపెట్టారు. ఈ వ్యాక్సిన్ కోతుల్లో వ్యాధినిరోధక శక్తిని పెంపొందించి యాంటీబాడీలను విడుదల చేశాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సైన్స్ ‌ మ్యాగజైన్‌ నివేదిక ఈ యాంటీబాడీలు సాధారణ వైరస్‌లపైనా దాడిచేస్తాయని స్పష్టం చేసింది. 
 
శాస్త్రవేత్తలు పికోవాక్‌ పేరుతో ఈ వ్యాక్సిన్ ను తయారు చేశారు. వ్యాక్సిన్ ఎక్కువ డోసులు ఇచ్చిన కోతుల్లో వైరస్ లేదని తాము గుర్తించామని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వ్యాక్సిన్ తీసుకోని కోతులు మాత్రం న్యూమోనియా భారీన పడ్డాయని అన్నారు. చైనా ఇప్పటికే ఈ వ్యాక్సిన్ ను మనుషులపై కూడా ప్రయోగిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే మనుషులపై ప్రయోగాలకు సంబంధించిన నివేదిక రావాల్సి ఉంది. 
 
ఇటలీ, ఇజ్రాయిల్ దేశాలు కూడా కరోనాకు వ్యాక్సిన్ కనిపెట్టడంలో సక్సెస్ అయ్యామని చెబుతున్నాయి. త్వరగా కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే కరోనాను కట్టడి చేయడం సాధ్యమవుతుంది. చైనా కరోనాను కట్టడి చేయడంలో సక్సెస్ కాగా ఇతర దేశాలు మాత్రం లాక్ డౌన్, భౌతిక దూరం ద్వారా కరోనాను కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నాయి. మనుషులపై చేసే ప్రయోగాల్లో టీకాలను కనిపెట్టిన దేశాలు సక్సెస్ అయితే మాత్రం కరోనాను పూర్తిస్థాయిలో నియంత్రించడం సాధ్యమవుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: