విశాఖపట్టణం ఎల్జి పాలిమర్స్ కంపెనీ గ్యాస్ లీక్ ప్రమాదంపై హైకోర్టు స్పందించింది. ఈ ఘటనను సుమోటో గా భావించి కేంద్ర మరియు జగన్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేయడం జరిగింది. ప్రజలు ఉంటున్న అటువంటి ప్రదేశాలలో అలాంటి ప్రమాదకరమైన పరిశ్రమ ఉండటాన్ని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వాలను న్యాయస్థానం ప్రశ్నించింది. దీనికి సంబంధించిన విచారణను కోర్టు వచ్చే వారానికి వాయిదా వేసింది. జరిగిన ప్రమాదం మానవ తప్పిదమే లేకపోతే నిర్లక్ష్యమో సరైన సమాధానం చెప్పాలని నాలుగు వారాలు టైం ఇవ్వటం జరిగింది. ఒకవైపు కరోనా వైరస్ తో పోరాడుతున్నా సమయములో విశాఖపట్టణం లో ఇటువంటి సంఘటన చోటు చేసుకోవడం దురదృష్టకరమని మానవ హక్కుల సంఘం అభిప్రాయపడింది.

 

 

అంతేకాకుండా దర్యాప్తు చేపట్టి నివేదిక అందించాలని డీజీపీకి ఆదేశాలు ఇవ్వాలని ఎన్​హెచ్ఆర్సీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దర్యాప్తు పూర్తి గా చేపట్టి నివేదిక అందజేయాలని నియమ నిబంధనల ఉల్లంఘన సంబంధిత వ్యవహారాలపై నివేదిక ఇవ్వాలని కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి కూడా ప్రత్యేక నోటీసులు ఎన్​హెచ్ఆర్సీ పంపించడం జరిగింది. దీంతో ఒక పక్క హైకోర్టు మరోపక్క మానవ హక్కుల సంఘం నోటీసులు పంపడంతో ప్రతిపక్షాలు జగన్ ప్రభుత్వాన్ని విమర్శించడానికి బలం చేకూర్చింది.

 

 

అయితే ఈ విషయంలో చాలా వరకు కంపెనీ తప్పు ఉండటంతో ప్రభుత్వంపై పెద్దగా విమర్శలు వచ్చే అవకాశం లేదని అంటున్నారు. అటువంటి ప్రమాదకరమైన సమయంలో పరిశ్రమ సైరన్ మోగించుకుండా  పెద్ద తప్పు చేసిందని ఈ విషయంలో కంపెనీ నుండి నివేదిక ప్రభుత్వానికి వస్తే గానీ అసలు విషయం బయటపడుతుందని మరోపక్క వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయంలో గాయపడిన బాధితులు చాలావరకు త్వరగానే కోలుకోవడం విశేషం. 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: