తెలుగుదేశం పార్టీని ఎప్పటినుండో వయసుతో నిమిత్తం లేకుండా చంద్రబాబు తన ఆలోచనలతో ముందుకు నడిపిస్తున్నారు. జాతీయ అధ్యక్షుడు హోదాలో చంద్రబాబు పార్టీ కోసం అహర్నిశలు కష్ట పడుతున్నారు. చంద్రబాబు సమర్థవంతంగా నడిపిస్తాడు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఒక విధంగా చెప్పాలంటే చంద్రబాబు లేకపోతే టిడిపి పార్టీ లేనట్లే. ఇటువంటి సమయంలో పార్టీ అధికారంలో లేకపోయినా గానీ నాయకులకు పార్టీ పదవులు మినహా మరే పదవులు దక్కే అవకాశం లేకపోయినా పార్టీలో నాయకులు చాలా సైలెంట్ గా ఉంటున్నారు. అయితే చంద్రబాబు రాజకీయ వారసుడిగా అడుగుపెట్టిన నారా లోకేష్ గురించి మాత్రం పార్టీలో ఉన్న నాయకులు అదేవిధంగా సీనియర్లు కూడా పెద్దగా నమ్మకం లేదు.

 

ఆయన పార్టీలోకి వచ్చిన నాటి నుండి ఇప్పటి వరకు పెద్దగా కలిసొచ్చింది ఏమీ లేదని పార్టీ నాయకుల అభిప్రాయం. అంతేకాకుండా గత ప్రభుత్వంలో ఆయన మంత్రి పదవి ఇవ్వటం కూడా అవసరమని దాని వల్ల పార్టీకి ఎన్నికల ప్రచారంలో టీడీపీ కి చాలా నష్టం వాటిల్లిందని సీనియర్ నాయకులు టాక్. మంత్రిగా మరియు ఎమ్మెల్సీగా సరైన రీతిలో చంద్రబాబు వారసుడిగా నారా లోకేష్ రాణించలేకపోయారు అని కామెంట్ చేస్తున్నారు. అప్పట్లో అధికారంలో ఉన్న ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న నారా లోకేష్ ప్రజల మధ్య లేరని అందువల్లనే లోకేష్ రాణించలేక పోతున్నారన్న వార్తలు గట్టిగా వస్తున్నాయి.

 

ఏదేమైనా తండ్రి చూపిన బాటలో నడుస్తూనే మరోపక్క ప్రజల మధ్య ఉంటేనే విజయవంతమైన రాజకీయ నాయకుడిగా రాణించగలరని చాలామంది లోకేష్ కీ సూచనలు ఇస్తున్నారు. టీడీపీకి రాష్ట్రంలో బలమైన పార్టీ క్యాడర్ ఉంది. ఇటువంటి సమయంలో కూడా పార్టీ క్యాడర్ తో ఉండకుండా ఎప్పుడూ సోషల్ మీడియా లోనే ఉంటే రాబోయే రోజుల్లో టిడిపి కార్యకర్తలు నారా లోకేష్ ని మర్చిపోయే అవకాశం ఉందని చాలామంది అంటున్నారు. మంచి యువ వయసులో ఉన్న లోకేష్ పార్టీ కేడర్ తో కలసి సరైన ప్రతిపక్ష పాత్ర ఈ టైంలో పోషిస్తే రాజకీయంగా తిరుగుండదని టిడిపి సీనియర్ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: