అగ్ర‌రాజ్యం అమెరికాలో ఈ ఏడాది జ‌ర‌గ‌బోయే అధ్య‌క్ష ఎన్నికలు జ‌ర‌గ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ ఏడాది న‌వంబ‌ర్‌లో అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి.  ప్ర‌స్తుత అధ్య‌క్షుడు, రిప‌బ్లిక‌న్ నేత డోనాల్డ్ ట్రంప్‌తో పోటీప‌డేందుకు డెమోక్ర‌టిక్ అభ్య‌ర్థిగా బైడెన్‌, సాండ‌ర్స్‌లు ప్రైమ‌రీ రేసులో కుస్తీప‌డుతున్నారు.  ఇలాంటి త‌రుణంలో బైడెన్‌పై తారా రీడ్ అనే ఓ మహిళ లైంగిక ఆరోప‌ణ‌లు చేసింది. దానికి కొన‌సాగింపుగా తాజాగా మ‌రింత సంచ‌ల‌న కామెంట్లు చేసింది.


56 ఏళ్ల తారా రీడ్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ,  1992-93 సంవ‌త్స‌రంలో యూఎస్ సేనేట‌ర్‌గా ఉన్న బైడెన్‌కు స్టాఫ్ అసిస్టెంట్‌గా ప‌నిచేశానని వెల్ల‌డించారు. ఆ స‌మ‌యంలో ఓ రోజు బైడెన్ త‌నతో అనుచిత రీతిలో ప్ర‌వ‌ర్తించిన‌ట్లు ఆమె ఆరోపించింది. దాదాపు 27 ఏళ్ల క్రితం బైడెన్ త‌న‌ను లైంగికంగా వేధించాడ‌ని వాపోయింది. త‌న‌పై జ‌రిగిన లైంగిక దాడికి సంబంధించిన అంశాల‌ను ఆమె మీడియాతో కూలంకుషంగా వెల్ల‌డించింది. శారీర‌కంగా దాడి చేసి.. త‌న‌తో శృంగారం కోరుకుంటున్న‌ట్లు బైడెన్ వేధించార‌ని తారా ఆరోపించింది. బైడెన్ దాడికి సంబంధించి లై డిటెక్ట‌ర్ ప‌రీక్ష‌కు కూడా తాను సిద్ధ‌మే అని ఆమె తెలిపింది.  బైడెన్ ఆ ప‌రీక్ష‌కు సిద్ధ‌మైతే, నేను కూడా సిద్ద‌మే అని రీడ్ తెలిపింది. 

 

లైంగిక వేధింపుల‌కు పాల్ప‌డిన బైడెన్‌.. అమెరికా అధ్య‌క్ష రేసు నుంచి త‌ప్పుకోవాలంటూ తారా డిమాండ్ చేసింది. ఒక అడుగు ముందుకు వేసి.. చేసిన త‌ప్పుకు బాధ్య‌త తీసుకోవాల‌ని బైడెన్‌ను ఆమె డిమాండ్ చేసింది. ఇలాంటి వ్య‌క్తిత్వం ఉన్న వాళ్లు అమెరికా అధ్య‌క్షులు కావొద్దు అని ఆమె పేర్కొన్న‌ది. బైడెన్ రాస‌లీల‌ల‌ను బ‌య‌ట‌పెట్ట‌డంతో.. ఆయ‌న‌ మ‌ద్ద‌తుదారుల నుంచి బెదిరింపులు వ‌స్తున్న‌ట్లు ఆమె చెప్పింది.

 

ఇదిలాఉండ‌గా, ప్రైమ‌రీ ఎన్నిక‌ల్లో బైడెన్ దూసుకుపోతున్నారు. వ‌ర్జీనియాలో 53 శాతం ఓట్ల‌తో బైడెన్ గెలిచారు. అక్క‌డ రెండ‌వ స్థానంలో ఉన్న సాండ‌ర్స్‌కు కేవ‌లం 23 శాత‌మే ఓట్లు ద‌క్కాయి.  అంటే ఆఫ్రిక‌న్‌-అమెరిక‌న్ ఓట్ల‌ను బైడెన్ ఎక్కువ శాతం గెలుచుకున్న‌ట్లు తెలుస్తోంది. వ‌ర్జీనియా, నార్త్ క‌రోలినా లాంటి కీల‌క రాష్ట్రాల‌ను బైడెన్ గెల‌వ‌డంతో.. 2020 ఎన్నిక‌లు ఆస‌క్తిగా మారే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: