భారతదేశంలో కరోనా తగ్గుతుందని అందరు సంతోషపడుతున్నారు.. ఆయా ప్రభుత్వాలు తీసుకున్న చర్యలకు సంతోషిస్తున్నారు.. ఇక ఈ వైరస్ పై విజయాన్ని సాధించామని ఆనందంతో గెంతులు వేస్తున్నారు.. కానీ ఇక్కడొక షాకింగ్ న్యూస్ ఏంటంటే కరోనా అనేది ఎలా వ్యాపించినా అదిమాత్రం మన జీవితంలో భాగమైపోయింది.. ప్రజలందరికి బందువులా మారిపోయింది.. నిను వీడని నీడను నేనంటూ రానున్న రోజుల్లో మరోసారి తన ప్రతాపం చూపించడానికి సిద్దపడటం ఖాయమని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు..

 

 

ఎందుకంటే ఈ లాక్‌డౌన్ ఎత్తివేయక ముందే ప్రజలందరు సోషల్ డిస్టెన్స్ పాటించకుండా అసలు కరోనా అనేది ఉందనే విషయాన్ని మరచి ప్రవర్తిస్తున్నారు.. అందులో ఇప్పటివరకు కొన్ని కొన్ని పల్లెటూళ్లో దీని జాడలు కనబడలేదు.. కానీ మరొక్క సారి ఇది విజృంభించడం అంటూ జరిగితే మనదేశంలో ప్రాణ నష్టం అధికంగా ఉంటుందనే వాదనలు వినిపిస్తున్నాయి.. నగరాల్లో, పట్టణాల్లో, పల్లెటూళ్లో దీని వ్యాప్తిని రాబోయే రోజుల్లో ఆరికట్టడం కాస్త కష్టంతో కూడుకున్న పనని హెచ్చరికలు జారి అవుతున్నాయి.. ఇప్పటికే కరోనా కొరల్లో చిక్కుకున్న శ్రామికులు, కార్మికులు ఇక ఇంట్లో కూర్చుని తినే పరిస్దితులు చేదాటిపోయాయి.. కాగా దేశంలో రానున్న వర్షకాలం, చలికాలం చాలా ముఖ్యమైనవి.. ఈ ఎనిమిది నెలలే భారతదేశ భవిష్యత్తును నిర్దేశించనుందని వాదనలు వినిపిస్తున్నాయి..

 

 

ఇకపోతే లాక్ డౌన్ ను ఎత్తివేసిన తరువాత కూడా ఉన్నట్లుండి కేసుల భారీగా పెరిగే అవకాశం ఉన్న నేపధ్యంలో అందుకు సంబంధించిన ఏర్పాట్లపై ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి పెట్టాలని, ఇందుకు గాను బెడ్స్ పారామెడికల్ సిబ్బంది ఇంటెన్సివ్ కేర్ యూనిట్స్ వెంటిలేటర్స్ లాంటి వసతులు సిద్ధం చేసి పెట్టుకోవడం ఉత్తమమైన పని అని అంటున్నారు.. అంతే కాకుండా అన్ని ప్రభుత్వ హస్పిటల్లో ప్రజా అవసరాలకు సరిపడ తగినంత వైద్య సిబ్బందిని నియమించుకోవడం తప్పని సరని చెబుతున్నారు..

 

 

సో ప్రజల్లారా కరోనాకు మందు వచ్చేవరకు జాగ్రత్తగా బ్రతకడం అవసరం.. లేదంటే నూతన సంవత్సరం వచ్చే వరకు ఎంత మంది ఆప్తులు, ఆత్మీయులను కోల్పోవలసి వస్తుందో అంచనా వేయడం కష్టం అని తెలుస్తుంది.. అందుకే అధికారులు చెప్పినట్లుగా పద్దతులు పాటిస్తూ ప్రాణాలు కాపాడుకుందాం.. 

మరింత సమాచారం తెలుసుకోండి: