దేశవ్యాప్తంగా కరోనా వైరస్ ని అరికట్టడానికి అమలు చేస్తున్న లాక్ డౌన్ కార‌ణంగా ఎక్కడికక్కడ రవాణా ఆగిపోవటం జరిగింది. దీంతో చాలావరకూ కొంతమంది వేరే రాష్ట్రాలలో చిక్కుకుపోవడంతో అనేక అవస్థలు పడుతున్నారు. ఊరు గాని ఊరు ఇతర రాష్ట్రాలలో రోజుల తరబడి ఉండటంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటువంటి సమయంలో కొంత మంది ప్రభుత్వ అనుమతులతో సొంత వాహనాలు పెట్టుకుని వస్తుంటే మరోపక్క ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక రైళ్లు మరియు బస్సుల ద్వారా సొంత స్వస్థలాలకు చేరే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ సమయంలో చాలామంది ఎప్పుడు సాధారణ రవాణా వ్యవస్థ ఓపెన్ చేస్తారు అన్న దాన్ని విషయంపై ఎదురుచూస్తున్నారు.

 

అటువంటి వారికి ముఖ్యంగా రైల్వే ప్రయాణం చేయాలి అని అనుకున్న వారికి కేంద్ర ప్రభుత్వం బంగారం లాంటి వార్త రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. అదేమిటంటే త్వరలోనే ప్రజారవాణా స్టార్ట్ చేయడానికి కేంద్రం సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు. కుదిరితే మే నేల ఆఖరున బస్సులు రైళ్లను పాక్షికంగా పునరుద్ధరించే అవకాశాలు ఉన్నట్లు చెప్పుకొచ్చారు. వైరస్ మే 17 లోపు చాలా వరకు తగ్గుముఖం పట్టే అవకాశం ఉండటంతో ఈ నిర్ణయం కేంద్రం తీసుకోబోతున్నట్లు నితిన్ గ‌డ్క‌రీ తెలిపారు. అంతేకాకుండా దీనికి సంబంధించిన కొత్త మార్గదర్శకాలు రూపొందిస్తున్నామని భౌతిక దూరం పాటించేలా మార్గదర్శకాలు ఉండబోతున్నాయని తెలిపారు.

 

ప్రజా రవాణాకు సంబంధించి లండన్ మోడల్ ను పరిశీలిస్తున్నామని గడ్కరీ చెప్పుకొచ్చారు. కుదిరితే మే 17 తర్వాత ఒక వారం గ్యాప్ లోనే ప్ర‌జా రవాణా పునఃప్రారంభించే అవ‌కాశాలున్న‌ట్లు తెలుస్తోంది. చాలావరకు ఇతర రాష్ట్రాలలో చదువుకుంటున్న విద్యార్థులు, ఉద్యోగస్థులు ఉండిపోవడంతో చేయడానికి ఉద్యోగం లేకపోవడం తో అనేక అవస్థలు పడుతున్నారు. ఇలాంటి సమయంలో కేంద్రం ప్రకటించిన ఈ వార్త వారికి ఊరట  ఇచ్చినట్లయింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: