ప్రస్తుతం పాకిస్థాన్ ప్రధాని  ఇమ్రాన్ ఖాన్ ఇచ్చిన స్టేట్మెంట్ చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. భారత చర్యలపై ఏకంగా ప్రపంచాన్ని హెచ్చరిస్తూ పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ హెచ్చరికలు జారీ చేస్తూ స్టేట్మెంట్ ఇచ్చారు.  ప్రస్తుతం ఇది చర్చనీయాంశంగా మారిపోయింది. జమ్మూకాశ్మీర్లోని పుల్వామా జిల్లాలో భద్రతా బలగాలు హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ రియాజ్ మట్టుబెట్టడం  ఇప్పుడు తనకు సమస్యగా మారిందని... ప్రస్తుతం ఉన్న క్లిష్ట పరిస్థితులను అవకాశంగా తీసుకుని చొరబాటు నేపథ్యంతో భారత్ తప్పుడు ఆపరేషన్లు చేస్తోంది అంటూ ఆరోపించారు. కాశ్మీర్లో నెలకొన్న అస్థిరత్వానికి పాకిస్థాన్ కారణం అన్న కోణాన్ని ప్రొజెక్ట్ చేసేందుకు కోసమే భారత్ ఇలాంటి తప్పుడు ఆపరేషన్లు చేపడుతుందని... దీని గురించి ప్రపంచాన్ని  హెచ్చరిస్తున్నాను అంటూ ఇమ్రాన్ ఖాన్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. 

 

 అయితే ఇవన్నీ నిరాధారమైనటువంటి ఆరోపణలు అంటున్నారు విశ్లేషకులు. భారత్ తప్పుడు అజెండా  కొనసాగింపులో భాగంగా తప్పుడు ఆపరేషన్లు  చేస్తుంది  అంటూ ప్రస్తుతం ఇమ్రాన్ ఖాన్  ప్రపంచానికి చాటి చెబుతున్నట్లుగా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే కాశ్మీర్లో జరిగిన అల్లర్లు స్థానిక మైనటువంటివని...  రెండు  దేశాల మధ్య జరిగినవి కావు  అంటూ ఇమ్రాన్ ఖాన్ అంటున్నారు... వీటి కారణంగా దక్షిణాసియాలో ఏకంగా  శాంతికి భంగం కలుగుతుంది అంటూ ఇమ్రాన్ ఖాన్ ఆరోపిస్తున్నారు. అయితే కాశ్మీర్ లో జరిగే అన్ని అల్లర్లకు పాకిస్థాన్ కారణం అన్న విషయం అందరికీ తెలిసిన విషయమే... 

 


 అక్కడేమో ఇమ్రాన్ ఖాన్ లాంటి అధికారపక్షం మరియు ప్రతిపక్షం కలిసి భారత్ పై విరుచుకుపడుతూ  విమర్శలు చేస్తున్నారు ... ఇక్కడేమో కేవలం అధికార పక్షం మాత్రమే పాకిస్తాన్ కు కౌంటర్ ఇస్తుంది ప్రతిపక్షాలు మాత్రం నోరు మెదపకుండా ఉంటుంది.. ఒకవేళ అధికారపక్షం దీనిపై ఏమైనా చర్యలు తీసుకుంటే భారత్లో ఉన్న ప్రతిపక్షాల మొత్తం అధికారపక్షం తీసుకున్న చర్యలను తప్పుబట్టడానికి సిద్ధంగా ఉంటాయి .ఇక  అధికార పక్షం దీనికి ఏమైనా చర్యలు చేపట్టినప్పటికీ రేపొద్దున రాహుల్ గాంధీ  మళ్లీ అధికార పక్షంపై ఏదో ఒక విమర్శ చేసే అవకాశం ఉందని అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: