ప్రపంచం మొత్తాన్ని కబళించిన కరోనా వైరస్ ను మట్టుబెట్టేందుకు ఎంతో మంది శాస్త్రవేత్తలు ఎన్నో పరిశోధనలు చేస్తూ ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తున్నా దానికి తగ్గ వ్యాక్సిన్ ఇంకా కనిపెట్టలేకపోయారు. లోపలే రోజుకి వేలాది మంది ప్రాణాలను హరిస్తున్న మహమ్మారి ఇంకెంతకాలం మానవ జీవితంలో ఇమిడిపోయి ఉంటుందో ఎవరికీ అర్థం కావట్లేదు.

 

అయితే ఆధునిక సైన్స్ కు కూడా తెలియని ఎన్నో సమాధానాలను తన చరిత్రపుటల్లో పొందుపరచుకొన్న ఆయుర్వేద శాస్త్రం ఇప్పుడు కరోనా వైరస్ విరుగుడుకి పనిచేయబోతోంది. ప్రపంచ దేశాలు కరోనా వైరస్ ను పూర్తిగా నివారించేందుకు విస్తృతంగా పరిశోధనలు చేస్తూ ఉండగా భారతదేశంలో ఉన్న అన్ని వైద్య శాస్త్రాలలో కూడా పరిశోధనలకు అనుమతి ఇవ్వడం జరిగింది.

 

అయితే వారు ఇప్పుడు మెడికల్ ఆయుర్వేదం హోమియోపతి తదితర వైద్య శాస్త్రం లో ప్రయోగాలు చేయబోతున్నారు. భారత దేశ గొప్ప వైద్యశాస్త్రం అయినా ఆయుర్వేదం ద్వారా కరోనా వైరస్ కు విరుగుడు కనిపెట్టేందుకు భారత ప్రభుత్వం చర్యలు చేపట్టగా నేపథ్యంలో ఆయుర్వేద మూలిక అశ్వగంధ పై నిర్వహించేందుకు రంగం సిద్ధం చేశారు.

 

 

ఇకపోతే ఇప్పటివరకూ కరోనా నివారణలో అగ్రగామిగా పేరొందిన మలేరియా ముందు హైడ్రాక్సి క్లోరోక్విన్ తో పోలిస్తే అశ్వగంధ సమర్థవంతంగా పని చేస్తుందని పలువురు చెబుతున్నారు. ఈక్రమంలోని దానిపై ఐసీఎంఆర్ సీఎస్ఐఆర్ సాంకేతిక సిబ్బంది సాయంతో ఆయుష్ వైద్య శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖలు ఉమ్మడిగా క్లినికల్ ట్రయల్స్ నిర్వహించనున్నాయి. కరోనా లక్షణాలు స్వల్పంగా కాస్త ఎక్కువగా ఉన్న రోగులకు అశ్వగంధతో పాటు యష్టిమధు గుడూచి పిప్పలి పాలా హెర్బల్ ఫార్మలేషన్ (ఆయుష్ 64) ఇస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: