దేశవ్యాప్తంగా కలకలం సృష్టించిన ఎల్‌జీ పాలిమర్స్‌ గ్యాస్‌ లీకేజీ ఇంకా ఓ కొలిక్కి రాలేదా.. ఇంకా పరిశ్రమ నుంచి వాయువులు లీకవుతూనే ఉన్నాయా.. స్టెరీన్ గ్యాస్ లీకేజీని పూర్తిగా అరకట్టలేదా.. ప్రస్తుతం పరిశ్రమలోని గ్యాస్ ట్యాంకర్ల వద్ద 120 డిగ్రీల సెంటిగ్రేట్ ఉష్ణోగ్రత ఉందా.. అంటే అవుననే సమాధానం వస్తోంది. ఈ విషయాన్ని ప్రభుత్వ వర్గాలు ధ్రువీకరిస్తున్నాయి. అంతే కాదు.. వైద్యులు, నిపుణులు చెప్పేవరకు ఎవరూ కూడా ప్రమాద స్థలానికి వెళ్లొద్దని హెచ్చరిస్తున్నారు.

 

 

శుక్రవారం విశాఖలోని కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న బాధితులను మంత్రులు పరామర్శించారు. అనంతరం గ్యాస్‌ లీక్‌ ఘటనపై మంత్రులు, అధికారులు సమావేశం నిర్వహించారు. ఈ మీటింగ్‌లో ఆళ్ల నాని మాట్లాడుతూ ప్రభుత్వ వర్గాలు చెప్పే వరకూ ఎవరూ ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ వైపు వెళ్లొద్దని హెచ్చరించారు. ఇక ఈ గ్యాస్ లీకేజీ ఘటన బాధితుల వివరాల్లోకి వెళ్తే.. 554 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

 

 

గ్యాస్‌ లీక్‌ ఘటనలో అస్వస్థతకు గురైన వారికి ప్రభుత్వం వైద్యం అందిస్తోంది. ఎవరికీ ప్రాణపాయం లేదు. ఆసుపత్రుల నుంచి 128 మంది పూర్తిగా కోలుకొని ఇళ్లకు కూడా వెళ్లారు.305 మంది కేజీహెచ్‌లో ఉన్నారు. వీరిలో 52 మంది చిన్నారులు ఉన్నారు. ప్రైవేట్‌ ఆసుపత్రిలో 121 మంది చికిత్స పొందుతున్నారు. ఎవరికీ ప్రాణపాయం లేదు. గ్యాస్‌ లీక్‌బాధితులకు ప్రభుత్వమే వైద్య ఖర్చులు భరిస్తుంది.

 

 

ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ పరిసర ప్రాంతాల ప్రజలు ఎవరూ కూడా భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదని.. అయితే అప్రమత్తతతో ఉండటం అవసరంగా కనిపిస్తోంది. ఈ విషయంలో అధికార వర్గాలు చెప్పే విషయాలు ఫాలో అవుతూ తగిన జాగ్రత్తలో ఉండటం మంచిది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: