ఏపీ మాజీ సీఎం చంద్రబాబు వైఖరి కొన్నిసార్లు పార్టీ నేతలకే అర్థం కాకుండా ఉంటోంది. హైదరాబాద్ లో కూర్చుని తరచూ ప్రెస్ మీట్లు నిర్వహిస్తోన్న చంద్రబాబు మరీ ఎక్కువ మాట్లాడితే మన అజ్ఞానమే బయటపడుతుందన్న విషయం మరిచిపోతున్నారా అనిపిస్తోంది. ఏదోలా విమర్శలు చేయాలి.. తన అనుకూల మీడియాలో కనిపించాలి అన్న దుగ్ధ ఆయనలో స్పష్టంగా కనిపిస్తోంది.

 

 

ఎందుకంటే.. ఒకప్పుడు దేశ రాజకీయాల్లో చక్రం తిప్పిన నాయకుడు.. ఇప్పుడు చివరకు మంత్రి బొత్స సత్యనారాయణ వంటి భోళా రాజకీయ నాయకుడికి కూడా దొరికిపోతున్నారు. విశాఖ గ్యాస్ లీకేజీ ప్రమాదంపై స్పందించిన చంద్రబాబు... అసలు జనావాసాల మధ్య అలాంటి పరిశ్రమకు ఎలా అనుమతి ఇచ్చారని మండిపడ్డారు. ప్రజల ప్రాణాలు అంటే ఈ ముఖ్యమంత్రికి లెక్కలేదు అని విమర్శించారు.

 

 

అయితే చంద్రబాబు ఇక్కడే లాజిక్ మరచిపోయారు. జగన్ సీఎం అయ్యి సరిగ్గా ఏడాది అవుతోంది. మరి ఈ ఎల్జీ పాలిమర్స్ ఫ్యాక్టరీ దాదాపు 25 ఏళ్ల నుంచి ఉంటోంది. ఆ ఫ్యాక్టరీ ఉన్న సమయంలోనే చంద్రబాబు దేశంలోనే అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్నారు. మరి అప్పుడు చంద్రబాబుకు ఈ పరిశ్రమ కనిపించలేదా..అసలు ఈ పరిశ్రమకు అనుమతి ఇచ్చింది అప్పటి ప్రభుత్వాలు కాదా.. ఈ లాజిక్కే పట్టుకున్నారు మంత్రి బొత్స సత్యనారాయణ.

 

 

ఇక తనదైన స్టయిల్లో చంద్రబాబును ఓ ఆట ఆడుకున్నారు. కోటి రూపాయల పరిహారాన్ని ముఖ్యమంత్రి జగన్ ప్రకటించినా, చంద్రబాబు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని బొత్స విమర్శించారు. అధికారులు సకాలంలో స్పందించడం తప్పా? ప్రజాప్రతినధులు, మంత్రులు వచ్చి పర్యవేక్షించడం తప్పా? ముఖ్యమంత్రి జగన్ వెంటనే విశాఖపట్నం వచ్చి బాదితులను పరామర్శించడం తప్పా? ఎల్ జి పాలిమర్ ఇప్పుడు కొత్తగా ఏర్పడిన సంస్థా..? కొన్ని దశాబ్దాలుగా ఉన్న సంస్థని చంద్రబాబుకు తెలియదా?ఆయన టైమ్ లో ఈ పరిశ్రమ ఎలా కొనసాగింది? అసలు చంద్రబాబు బుర్ర ఉండీ మాట్లాడుతున్నారా లేకుండా మాట్లాడుతున్నారా అంటూ కడిగేశారు మంత్రి బొత్స.

 

మరింత సమాచారం తెలుసుకోండి: