పాపం.. చంద్రబాబు.. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత అందరికీ లోకువైపోయారు. ఆయన గత ప్రాభవాన్ని ఏమాత్రం పట్టించుకోవడం లేదు. నాలుగేళ్ల దోస్తానాను కూడా ప్రధాని మోడీ మరిచిపోతున్నారు. మరచిపోవడమే కాదు.. పగబట్టి మరీ కసి తీర్చుకుంటున్నారా అన్న అనుమానాలు వస్తున్నాయి.

 

 

ఎందుకంటే.. విశాఖ గ్యాస్ దుర్ఘటన తర్వాత తాను విశాఖ వెళ్తానని చంద్రబాబు ప్రకటించారు. అయితే ఆయన ఉన్నది హైదరాబాద్ లో.. హైదరాబాద్ నుంచి విశాఖ వెళ్లాలంటే ఓ రాష్ట్రం దాటి వెళ్లాలి. అందులోనూ విమానంలో పోవాలి. లాక్ డౌన్ అమల్లో ఉన్నవేళ.. కేంద్రం అనుమతి లేకుండా ఇలాంటి ప్రయాణాలు చేయడం కుదరదు. అందుకే చంద్రబాబు కేంద్రానికి తనను విశాఖ అనుమతించమని దరఖాస్తు పెట్టుకున్నారు.

 

 

ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పుకున్నారు కూడా. అయితే మోడీ మాత్రం పాత పగలు మరిచిపోయినట్టులేదు.. అందుకే.. చంద్రబాబు మొరపెట్టుకున్నా.. మోడీ స్పందించలేదు. అనుమతి ఇంకా రాలేదు. ఈ అంశాన్ని కూడా చంద్రబాబే ధ్రువీకరించారు. విచిత్రం ఏంటంటే.. చంద్రబాబుకు అనుమతి వచ్చిందని గురువారం నాడే ఆయన అనుకూల మీడియా కొద్దిసేపు ఊదరకొట్టింది. చంద్రబాబు ప్రత్యేక విమానం లేదా హెలికాప్టర్ ద్వారా విశాఖ వెళుతున్నారని నానా హడావుడి చేసింది.

 

 

కానీ ఇంతలో ఏమైందో కానీ.. అనుమతి మాత్రం రాలేదు. చంద్రబాబు విశాఖ పర్యటన రద్దయింది. పాపం.. చంద్రబాబు నాయుడు హైదరాబాద్ నుంచే మీడియా సమావేశం పెట్టి ముఖ్యమంత్రి జగన్ పై విమర్శలు చేయాల్సి వచ్చింది. మరి ఇంతకీ మోడీ ఎందుకు చంద్రబాబు పర్మిషన్ ఇవ్వలేదన్నది అర్థంకాని ప్రశ్నగా మారింది. కావాలనే చంద్రబాబును అవమానిస్తున్నారా.. లేదా వేరే ఏదైనా కారణం ఉందా.. అన్నది తేలాల్సి ఉంది. పాపం.. మొత్తానికి చంద్రబాబు బ్యాడ్ టైమ్ నడుస్తోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: