విశాఖ దుర్ఘటన విషయంలో సీఎం జగన్ చురుకుగానే స్పందించారు. ఘటన విషయం తెలిసిన దగ్గర నుంచి అధికారులతో టచ్ లో ఉన్నారు. ఏమేం చేయాలో ఆదేశించారు. హుటాహుటిన వైజాగ్ వెళ్లారు. బాధితులను పరామర్శించారు. గ్యాస్ కంపెనీ వాళ్లతో మాట్లాడారు. భారీ పరిహారం ప్రకటించారు. ఇలా చేయాల్సినవన్నీ చేశారు. కానీ.. వీటిని ఒప్పుకుంటే ప్రతిపక్షం ఎలా అవుతుందనుకున్నారో ఏమో.. చంద్రబాబు జగన్ అన్నింటినీ లైట్ గా తీసుకున్నాడంటూ విమర్శించడం ప్రారభించారు.

 

 

ఇంతకీ జగన్ చేసిన తప్పేమిటని చంద్రబాబు అంటున్నారంటే.. పరిశ్రమ వద్దకు వెళ్లకపోవడం.. అదే తాను సీఎంగా ఉండి ఉంటే.. తప్పుకుండా ఆ ఫ్యాక్టరీ వద్దకు వెళ్లేవాడినే అని చెప్పుకున్నారు. తానైతే ప్యాక్టరీ వద్దకు వెళ్లేవాడినని చంద్రబాబు అంటూ.. ఆ తర్వాత కొద్దిగా సర్దుకుని అప్పుడు వెళ్లడానికి వీలు లేకపోతే మరుసటి రోజు వెళ్లాలని చంద్రబాబు కామెంట్ చేశారు.

 

 

దీంతో చంద్రబాబు విమర్శలపై సోషల్ మీడియాలో బాగా ట్రోలింగ్ జరుగుతోంది. అవును.. చంద్రబాబు సీఎం అయ్యి ఉంటే.. గ్యాస్ లీకేజీ విషయం తెలియగానే.. ప్రత్యేక విమానమో.. హెలికాప్టరో ఏది దొరికితే అది పట్టుకుని ఎల్జీ పాలిమర్స్ వద్ద వాలిపోయేవారు. హెలికాప్టర్ ఆగీ ఆగక ముందే.. దాన్ని నుంచి జంప్ చేసి.. ఫ్యాక్టరీలోకి ఉరికే వారు.. ఆ గ్యాస్ లీకేజీ ఎక్కడ ఉందో చూసి... చటుక్కున ఆ వాల్వ్ ను తిప్పేసేవారు.. విశాఖ జనాన్ని కాపాడేవారు.. అంటూ సెటైర్లు పేలుస్తున్నారు.

 

 

అంతే కాదు.. విశాఖలో గ్యాస్ లీకేజీ జరిగిందన్న బాధ కంటే.. తాను సీఎంగా లేననే బాధ చంద్రబాబు గొంతులో వినిపిస్తోందన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. పాపం.. అందుకనే ముఖ్యమంత్రి జగన్ ఈ ఘటనను సీరియస్ గా తీసుకోలేదని.. ఇంకా ఏవేవో రొటీన్ విమర్శలు చేస్తున్నారు చంద్రబాబు.

మరింత సమాచారం తెలుసుకోండి: