విశాఖ ఎల్‌జీ పాలిమర్స్‌ పరిశ్రమలో జరిగిన గ్యాస్ లీక్ ప్రమాదం దేశమంతా చర్చ జరిగేలా చేసింది. అసలు ప్రమాదం గురించి వార్తలు వచ్చిన మొదట్లో విపరీతమైన భయాందోళనలు నెలకొన్నాయి. బాధితుల దృశ్యాలు సోషల్ మీడియాలో భయప్రకంపనలు పుట్టించాయి. జనం రోడ్లపైనే పడిపోవడం.. బావుల్లో పడి చనిపోవడం.. కాల్వల్లో పడిపోవడం వంటి దృశ్యాలు చూస్తే.. ప్రాణ నష్టం భారీగా ఉండొచ్చనే భయాందోళనలు నెలకొన్నాయి.

 

 

అయితే అదృష్టవశాత్తూ.. కాస్త ప్రాణ నష్టం తక్కువతోనే బయపడ్డామని చెప్పాలి. అయితే ఇప్పుడు ఈ ప్రమాదానికి సంబంధించిన సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. అదేంటంటే.. ఎల్జీపాలిమర్స్ ట్యాంకు దగ్గర ఏర్పాటుచేసిన సేఫ్టీ వాల్వు తెరుచుకోవటం వల్ల భారీ ప్రమాదం తప్పిందట. కొద్ది మొత్తంలోనే స్టెరీన్ లీక్ అయ్యిందట. అదే సేఫ్టీ వాల్వ్ ఓపెన్ కాకపోయి ఉంటే.. పరిశ్రమలో ఉన్న మొత్తం స్టెరీన్ అంతా లీక్ అయ్యి ఉండేదట.

 

 

కొద్ది మొత్తానికే ఇంత బీభత్సం జరిగితే.. ఇక మొత్తం స్టెరీన్ లీకై ఉంటే.. తలచుకుంటనే భయంకరంగా ఉంది. అదే జరిగితే.. విశాఖ శవాల దిబ్బగా మారి ఉండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వివరాలోకి వెళ్తే.. ట్యాంకులో నిల్వ చేసిన స్టైరీన్‌ నియంత్రణకు సేఫ్టీ వాల్వులు ఏర్పాటుచేశారు. ట్యాంకు నిర్వహణ సమాచారాన్ని వాటికి ఉన్న మీటర్ల ద్వారా తెలుసుకునే వెసులుబాటు ఉంటుంది.

 

 

ట్యాంకు దగ్గర నిర్వహించాల్సిన ఉష్ణోగ్రతలను తెలుసుకునేలా మీటర్లు ఉన్నాయి. ట్యాంకులో పీడనం ఎంత ఉందనే సమాచారం కూడా మీటర్‌ సూచిస్తుంది. ప్రమాదం జరిగినప్పుడు ట్యాంకు దగ్గర ఉన్న సేఫ్టీ వాల్వు తెరుచుకుంది. ఇలా జరగకుంటే పీడనం పెరిగి, ట్యాంకు పేలిపోయి ఉండేది. అప్పుడు అందులో ఉన్న స్టైరీన్‌ మొత్తం వాతావరణంలో కలిసేది. అదే జరిగి ఉంటే విశాఖలో ఎన్ని వందల శవాలు కనిపించేవో చెప్పలేమంటున్నారు నిపుణులు.. దేవుడు విశాఖను కాపాడాడనే చెప్పాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: