ప్ర‌పంచవ్యాప్తంగా ఇప్పుడు అంద‌రి ఆలోచ‌న‌లు క‌రోనా కేంద్రంగానే సాగుతున్నాయి. ఈ మ‌హ‌మ్మారి ఉగ్ర‌రూపం నేప‌థ్యంలో వివిధ దేశాలు వ‌ణికిపోతున్నాయి. ఈ స‌మ‌యంలోనే ఓ వార్త మ‌రింత ఆందోళ‌ను కార‌ణ‌మైంది. కరోనా వైరస్‌ శృంగారం ద్వారా వ్యాప్తి చెందుతుందని ప‌లు అంచ‌నాలు వ‌చ్చాయి. అయితే, ఇది నిజ‌మ‌ని తేలింది. త‌ద్వారా ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ చేసిన హెచ్చ‌రిక‌లు నిజం అయ్యాయి.

 

జామా నెట్వ‌ర్క్ ఓపెన్‌ జ‌ర్న‌ల్‌లో చైనా ప‌రిశోధ‌కులు ప్ర‌చురించిన వివ‌రాల ప్ర‌కారం, చైనాలోని షాంఘై మున్సిపల్‌ దవాఖానకు చెందిన పరిశోధకులు 38 మంది రోగుల వీర్యాన్ని సేకరించి పరీక్షించగా.. ఆరుగురిలో వైరస్‌ ఉన్నట్టు గుర్తించారు. క‌రోనా వైర‌స్ నుంచి కోలుకున్న పేషెంట్ల‌కు చెందిన వీర్య‌క‌ణాల్లో వైర‌స్ ఆన‌వాళ్లు ఉన్న‌ట్లు గుర్తించారు. దీని ఆధారంగా క‌రోనా వైర‌స్ .. శృంగారం చేస్తే కూడా సోకుతుంద‌న్న ఓ అభిప్రాయానికి వ‌చ్చారు. 38 మంది మ‌గ‌వారికి ప‌రీక్ష‌లు చేయ‌గా.. దాంట్లో 16 శాతం మంది వీర్య‌క‌ణాల్లో క‌రోనా వైర‌స్ ఉన్న‌ట్లు గుర్తించారు. 

 


బీజింగ్ ఆర్మీ జ‌న‌ర‌ల్ హాస్పిట‌ల్‌కు చెందిన డ‌యాన్ జెంగ్ లీ ఈ వెల్ల‌డించిన వివ‌రాల ప్ర‌కారం వీర్య‌క‌ణాల్లో ఉన్న వైర‌స్ రెట్టింపు కాక‌పోయినా.. ఆ వైర‌స్ మ‌నిషిలో స‌జీవంగా ఉంద‌న్న సంకేతంగా నిలుస్తుంద‌న్నారు.  SARS-CoV-2  వైర‌స్ పేషెంట్ల‌లో ఉన్న‌ట్లు గుర్తించామ‌ని, కోలుకుంటున్న‌వారిలోనూ ఆ వైర‌స్ ఉన్న‌ట్లు తెలిపారు.  ప్ర‌స్తుతానికి క‌రోనా వైర‌స్ ఏ స్థాయిలో శృంగారం ద్వారా వ్యాప్తి చెందుతోంద‌న్న విష‌యాన్ని శాస్త్ర‌వేత్త‌లు నిర్దారించ‌లేదు. కానీ వైర‌స్ సంక్ర‌మ‌ణ‌ను అడ్డుకోవ‌డంలో శృంగారం కూడా కీల‌కంగా మార‌నుం‌ది. అయితే వైరస్‌ ఎంతకాలంపాటు వీర్యకణాల్లో ఉంటుంది? శృంగారం ద్వారా మరొకరికి వ్యాపిస్తుందా? వంటి వాటికి వారు సమాధానాలు ఇవ్వలేదు. 

 

పురుషుల వీర్య‌క‌ణాల్లో అనేక ర‌క‌లా వైర‌స్‌లు ఉంటాయని శాస్త్రవేత్త‌లు పేర్కొంటు‌న్నారు.  ఎబోలా, జికా వైర‌స్‌లు కూడా వీర్య‌క‌ణాల ద్వారానే వ్యాప్తి చెందిన‌ట్లు శాస్త్ర‌వేత్త‌లు గుర్తించారు. వ్యాధి నుంచి కోలుకున్న చాలా రోజుల త‌ర్వాత కూడా వీర్య క‌ణాల ద్వారా వైర‌స్ వ్యాప్తి జ‌రిగినట్లు గుర్తించారు. వైర‌స్ సోకిన పేషెంట్లు.. కొన్నాళ్ల పాటు శృంగారానికి దూరంగా ఉండ‌డం ఉత్త‌మం. లేదంటే కండోమ్‌ల‌ను వాడాల్సి ఉంటుంది. ఈ రెండూ ప్ర‌స్తుతం పాటించాల్సిన‌ ర‌క్ష‌ణాత్మ‌క చ‌ర్య‌లు. పిల్ల‌లు కనాల‌నుకునేవారు ప్ర‌స్తుతం ఆ ప్లాన్స్‌ను విర‌మించుకోవాల‌ని నిపుణులు సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: