కల్యాణమొచ్చినా, కక్కొచ్చినా ఆగదంటారు... కానీ ఇప్పుడు కరోనా వల్ల ఏదీ చేయకుండా ఉండే పరిస్థితి నెలకొంది.  ఫిబ్రవరి నుంచి దేశంలో కరోనా కేసులు మొదలయ్యాయి.. ఇది మార్చిలో మరింత విజృంభించడంతో 24 నుంచి దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించారు. అప్పటి నుంచి జనసంచారం లేకండా బయట పూర్తిగా అష్ట దిగ్భందం చేశారు. మాల్స్, ఫంక్షన్ హాల్స్, బార్లు, మద్యం షాపులు అన్నీ క్లోజ్ చేశారు.  ఈ నేపథ్యంలో మార్చి, ఏప్రిల్, మే నెలలో జరగాల్సిన శుభకార్యాలన్నీ వాయిదా పడ్డాయి. లాక్​డౌన్​ ​ఎత్తేస్తే ఈ నెలో, వచ్చే నెలో గ్రాండ్​గా మ్యారేజ్​ చేసుకుందామనుకున్న యువతీ, యువకులు తాజా పరిస్థితులు చూసి నారాజ్​అవుతున్నారు. వచ్చే నెలలో ఓన్లీ నియర్​ అండ్ ​డియర్ ​మధ్య చేసుకుందామని కొందరు అనుకుంటుంటే, ఎక్కువమంది మాత్రం నవంబర్​ దాకా ఆగైనా ఫుల్​జోష్​లో చేసుకుంటామని చెప్తున్నారు.

 

 ఈ ఇబ్బందులు సామాన్యులకే కాదు.. సెలబ్రెటీలకు వచ్చిపడింది. టాలీవుడ్​ హీరోలు నిఖిల్, నితిన్ ఇప్పటికే తమ వెడ్డింగ్స్ పోస్ట్​పోన్​ చేసుకున్నారు. మళ్లీ నవంబర్ లోనే ముహూర్తాలుండగా, చాలామంది అప్పుడే చేసుకుంటామని చెప్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఇప్పటికే పెండ్లికి ఏర్పాట్లు చేసుకుని అడ్వాన్స్​లు ఇచ్చినవాళ్లు, ఉపాధి లేక వెడ్డింగ్ ప్లానర్స్, ఈవెంట్ ఆర్గనైజర్స్ ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం లాక్ డౌన్​ను ఈ నెల 29 తర్వాత కూడా పొడిగిస్తుందోమోనన్న డౌట్​తో నవంబర్​లో చేసుకుంటే బెటర్​ అనుకుంటున్నారు.

 

ప్రీ వెడ్డింగ్ షూట్ నుంచి మంగళ స్నానాలు, సంగీత్, ఎంటర్ టైన్ మెంట్, ఫంక్షన్ హాల్ లో లైటింగ్, డెకరేషన్, క్యాటరింగ్, ఇతర పెండ్లి పనులు, పోస్ట్ వెడ్డింగ్ షూట్ వరకు అన్నీ చేస్తుంటాయి. ఒక్కో కంపెనీ ద్వారా 100 నుంచి 200 మంది వర్కర్స్  ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. ఏది ఏమైనా మరో ఆరు నెలల వరకు కరోనా పరిస్థితిని బట్టి పెద్ద పెద్ద ఫంక్షన్ హాళ్లకు పరిమిషన్ ఇస్తారేమో అన్న సందేహాలు వస్తున్నాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: