ఎక్కడో చైనాలో వూహన్ నగరంలో మొదలైన కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. దీని దెబ్బకు అగ్రరాజ్యం అమెరికా విలవిలలాడుతోంది అంటే నమ్మండి. ఇప్పటివరకు అమెరికాలో 13 లక్షలకు పైగా కేసులు నమోదు అయ్యాయి అంటే నమ్మండి. అంతేకాదు అక్కడ దాదాపు 60 వేలమంది చనిపోయారు. ఈ దెబ్బతో అమెరికా అన్ని రకాలుగా దెబ్బతిందని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇది కేవలం అమెరికా దేశాన్ని మాత్రమే కాకుండా యూరప్ దేశాలను కూడా చాలా ప్రభావితం చేసింది. ముఖ్యంగా ఇటలీ, స్పెయిన్, జర్మనీ, రష్యా ఇలా చెప్పుకుంటూ వెళితే చాలా పెద్ద లిస్ట్ అవుతుంది.

 


ఆయా దేశాల్లో లక్షలకు లక్షలుగా కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. అలాగే మరణాల సంఖ్య కూడా 20 వేలకు దగ్గరగా కొనసాగుతున్నాయి. ఇక అదే భారతదేశ విషయానికి వస్తే... భారతదేశంలోనూ 60 వేలకు దగ్గరలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. అలాగే ప్రస్తుతం దేశంలో 1981 మరణాలు సంభవించాయి. అలాగే వీటి నుంచి 17847 మంది కరోనా వ్యాధిని జయించి ఇంటికి చేరుకున్నారు. ప్రస్తుతం దేశంలో 39384 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. 

 


ఇక మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే... గత రెండు రోజుల నుంచి కరోనా కేసులు తగ్గాయి అని చెప్పవచ్చు. ఇక తెలంగాణ రాష్ట్ర విషయానికి వస్తే ఇప్పటి వరకు మొత్తం 1132 కేసులు నమోదు కాగా అందులో 727 మంది వ్యాధి నుండి జయంచి ఇంటికి వెళ్లారు. అలాగే రాష్ట్రంలో కరోనా బారినపడి 29 మంది మరణించారు. అలాగే ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంకు వస్తే ఇప్పటి వరకు 1887 కేసులు నమోదయ్యాయి. 842 మంది డిశ్చార్జ్ అయి ఇంటికి వెళ్లారు. అలాగే రాష్ట్రంలో ఇప్పటివరకు 41 మంది మరణించారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: