విశాఖలో గ్యాస్ లీకేజీ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం గా మారిన విషయం తెలిసిందే. విశాఖ నగర సమీపంలోని ప్లాస్టిక్ తయారీ కంపెనీ అయిన ఎల్జీ పాలిమర్స్ అనే కంపెనీ నుండి తెల్లవారుజామున మూడు గంటల సమయంలో ప్రమాదవశాత్తు విషవాయువు భారీ మొత్తంలో లీక్ అవ్వడం... ఆ తర్వాత చుట్టుపక్కల మూడు కిలోమీటర్ల వరకు ఆ విష  వాయువు వ్యాప్తి చెందడంతో... ఏకంగా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వేల సంఖ్యలో ఈ విష వాయువు కారణంగా అస్వస్థతకు గురై ప్రాణాపాయ స్థితికి చేరుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనతో రాష్ట్రం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కి పాటుకు  గురైంది. దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. 

 

 

 

 అయితే ఈ ఘటనపై ఏకంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ సైతం ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి ప్రమాదానికి గల కారణాలను... ఆ విష వాయువు తీవ్రతను తెలుసుకునేందుకు ఆదేశించిన విషయం తెలిసిందే. అటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ ఘటనపై తీవ్రంగా స్పందిస్తుంది. ఇప్పటికే ఈ విష వాయువు ఘటన ద్వారా మరణించిన కుటుంబాలకు కోటి  రూపాయల పరిహారం ప్రకటించి సంచలనం సృష్టించారు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి. అంతేకాకుండా ఎల్జీ  పాలిమర్స్ కంపెనీ పై ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. 

 

 

 అయితే ఈ విష వాయువు కారణంగా ఎంతోమంది ప్రజలు ప్రాణాలు కోల్పోతున్న నేపథ్యంలో... ఏపీ సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో భద్రత ప్రమాణాలు పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న 86 కంపెనీలపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది జగన్మోహన్ రెడ్డి సర్కారు. వెంటనే ఉన్నతాధికారుల బృందం ఆయా పరిశ్రమలకు వెళ్లి అంతా పరీక్షించి భద్రత ప్రమాణాలు అన్ని సరిగ్గా ఉన్నాయని నిర్ధారణ చేసిన తర్వాతనే ఆ కంపెనీల నిర్వహణకు అనుమతులు ఇస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. లేనిపక్షంలో పరిశ్రమలను సీజ్ చేయడం తప్పదు అంటూ తెలిపింది ఏపీ సర్కార్. అంతేకాకుండా రెండు రోజుల వ్యవధిలో ఆయా  పరిశ్రమలకు సంబంధించిన నివేదికను ప్రభుత్వం  ముందు ఉంచాలంటూ ఆదేశాలు జారీ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: