ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ను  కట్టడి చేసే క్రమంలో ప్రపంచవ్యాప్తంగా లాక్ డౌన్ నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నారు. లాక్ డౌన్ నిబంధనలు ఎంత కఠినంగా అమలు చేస్తున్నా.. కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే లక్షల్లో కేసుల సంఖ్య పెరిగి పోయాయి. అలాగే మరణాలు కూడా తీవ్రంగానే నమోదవుతున్నాయి.  ఇప్పటి వరకు ఈ వైరస్ ను పూర్తిస్థాయిలో అంతమొందించే మందులు అందుబాటులోకి రాలేదు. కేవలం అందుబాటులో ఉన్న కొన్ని రకాల మందులతోనే నయం చేస్తున్నారు. ఇదే విషయమై వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ పదేపదే హెచ్చరిక చేస్తోంది. తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ రాయబారి డేవిడ్ నబారో స్పందించారు. భారత్ లో  కరోనా కట్టడి  విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది అని ఆయన ప్రశంసించారు. 

 

IHG


భారత ప్రభుత్వం సకాలంలో స్పందించడం వల్ల కేసుల సంఖ్య తక్కువగా నమోదు అవుతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు . లాక్ డౌన్ నిబంధనలు ఎత్తివేసినా  మరికొంత కాలం కేసుల సంఖ్య పెరుగుతాయని, ముఖ్యంగా జూలై నెలలో కరోనా కేసుల సంఖ్య గరిష్టస్థాయిలో పెరుగుతాయని ఆయన అభిప్రాయపడ్డారు .అయితే కేసులు పెరిగిన క్రమంగా వైరస్ విస్తరణ అదుపులోకి వస్తుందని భారత్ లో లాక్ డౌన్ కఠిన నిబంధనల కారణంగా త్వరలోనే పరిస్థితి అదుపులోకి వస్తుంది అని నాబారో తెలిపారు భారతదేశంలో ఉన్న జనాభా తో పోల్చితే కేసుల సంఖ్య తక్కువగానే ఉందని, భారత్ లో  వృద్ధుల సంఖ్య తక్కువగా ఉండటం కారణంగా మరణాల శాతం తక్కువగా ఉందని ఆయన అన్నారు. తాజాగా డబ్ల్యూహెచ్ఓ పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ఆరోపణలపై ఆయన స్పందించారు.

 


 దేశ అధ్యక్షుడు, ప్రధానమంత్రి ఆరోపణలు చేసినంత మాత్రాన కరోనా వైరస్ తో చేస్తున్న పోరాటం ఆగిపోదని, కరొనను కట్టడి చేసే లక్షణం నుంచి వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు అంటూ ఆయన అన్నారు. జూలైలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంటుందని, ప్రపంచ ఆరోగ్య సంస్థ భారత్ లో వేగంగా  చర్యలు తీసుకున్నాయి అంటూ ఆయన వ్యాఖ్యానించారు. జూలైలో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ విషయంలో చర్యలు తీసుకుంటుందని నబరో ప్రశంసించారు కేసుల సంఖ్య కొంతకాలం పెరిగిన భయపడాల్సిన అవసరం లేదని తొందర్లోనే అవుతుందని భారత ప్రభుత్వం ఆందోళన చెందుతూనే తాము  తీసుకుంటున్న చర్యల కారణంగా ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. అలాగే దేశంలో భారీ జనాభాతో పోలిస్తే నమోదైన కేసుల సంఖ్య తక్కువగానే ఉందని ఆయన అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: