ఆ పేరుతో ఏదో తెలియని అనుభూతి ..తెలియని ఆకర్షణతో పాటుగా.. మనల్ని కాపాడే శక్తి ఉంది.. అదేనండి మన అమ్మ.. మనిషిగా మనకు ఒక రూపం రావాలంటే రెండు శరీరాలు ఏకం కావాలి.. అప్పుడే మనం అనే ఒక ఆకారం ఈ ప్రపంచాన్ని చూస్తుంది.. ఈ సృష్టిలో అతి పెద్ద బంధం ఏదైనా ఉంది అంటే అది కేవలం అమ్మా బిడ్డలా బంధం ఒక్కటే.. జీవి ప్రాణం పోసుకోవలంటే అమ్మ అనే కవచం తప్పనిసరి.. 

 

 

 

 

 

దైవం కూడా అమ్మ మాటకు కట్టుబడి ఉందని చెబుతున్నారు.. అందుకే వాళ్ళు దేవుల్లు అయ్యారు .. మనం ఇలా మనుషులం అయ్యాం.ఒక ప్రాణి ప్రాణం పోసుకోవాలి అంటే.. మరో ప్రాణం జీవితాన్ని అంకితం చేయాలి... అది అమ్మా అవుతుంది. భారతీయులు అందుకే అమ్మను దైవం లా పూజిస్తారు.. అందుకే మన సంప్రదాయాలని, సంసృతలను అందరూ గౌరవిస్తారు.. 

 

 

 

 

 

మరో విషయమేంటంటే జన్మను ఇచ్చి అలానా పాలనా చూసి, మనల్ని తీర్చి దిద్దుతుంది.. మన అమ్మ ...ఒక్కో అడుగు మనం వేస్తుంటే మురిసి పోతుంది.. చదువు కొనే వయసుకు మన వెన్నంటి ఉండి .. విద్య బుద్దులు నేర్పిస్తుంది.. పెళ్లి చేసుకొని వెళ్ళాక కన్నీటిని దిగమింగుకుని నా బిడ్డ సంతోషంగా ఉంటె చాలు అని ఆలోచిస్తుంది.. అందుకే భయ్య అమ్మకు పిరికెడు అన్నాన్ని పెట్టండి.. పరమానంలా భావించి బిడ్డ ఎదుగుదల చూసి మురిసి పోతుంది.. అలాంటి అమ్మను వృద్దాప్యం రాగానే స్పెషల్ కేరింగ్ అంటూ దూరం చేయకండి.. ముసలి ప్రాణం తట్టుకోలేదు..

 

 

 

 

 

అందరూ ఉండి కూడా అమ్మను అనాథను చేసిన వాడు నిజంగానే గాడిదతో సమానం అని పెద్దలు అంటున్నారు.. పుట్టిన వాడు గిట్టక తప్పదు.. అలాంటి గ్యారెంటీ లేని జీవితంలో ఎందుకు ఇలా పాపాన్ని మూట కట్టుకుంటారు.. వృద్ధాశ్రమంలో తల్లులను వదిలేసే వాళ్లకు ప్రభుత్వం భారీ జరిమానా విధించాలి.. అలాగే ప్రభుత్వం నుంచి వస్తున్న అన్నీ రకాల సదుపాయాలను దూరం చేస్తే అప్పుడే..అమ్మ పై ప్రేమ తన్నుకుంటూ వస్తుంది.. అమ్మకు గుడి కట్టనవసరం లేదు .. కడుపునిండా అన్నం పెట్టండి.. హ్యాపీ మదర్స్ డే.. 

మరింత సమాచారం తెలుసుకోండి: