భూమ్మీద ఖరీదు కట్టలేనిది అమ్మ ప్రేమ .. ఎన్ని కోట్లు పోసిన ఆ ప్రేమ దక్కదు.. అందుకే ఎక్కడికైనా వెళ్లే తప్పుడు అమ్మకు నమస్కరించడం మన భారతీయ సంస్కృతీ..దేవుడి అందరినీ చూసుకోలేక అమ్మను సృష్టించాడు.. ప్రతి కుటుంబాన్ని కాపలా కాసే బాధ్యతను అమ్మకు అప్పగించాడు.. కోట్లకు పడగలెత్తే వాడైన .. గంజి పోసుకొని తాగే వాడికైనా కూడా అమ్మ ప్రేమలో మార్పు ఉండదు.. 

 

 

 

 

 

ఇకపోతే మనకు తన శరీరాన్ని పంచి, జన్మను ఇచ్చి అలానా పాలనా చూసి, మనల్ని తీర్చి దిద్దుతుంది.. మన అమ్మ ...ఒక్కో అడుగు మనం వేస్తుంటే మురిసి పోతుంది.. చదువు కొనే వయసుకు మన వెన్నంటి ఉండి .. విద్య బుద్దులు నేర్పిస్తుంది.. పెళ్లి చేసుకొని వెళ్ళాక కన్నీటిని దిగమింగుకుని నా బిడ్డ సంతోషంగా ఉంటె చాలు అని ఆలోచిస్తుంది.. అందుకే భయ్య అమ్మకు పిరికెడు అన్నాన్ని పెట్టండి.. పరమానంలా భావించి బిడ్డ ఎదుగుదల చూసి మురిసి పోతుంది.. అలాంటి అమ్మను వృద్దాప్యం రాగానే స్పెషల్ కేరింగ్ అంటూ దూరం చేయకండి.. తల్లి హృదయం తట్టుకోలేదు.. 

 

 

 

 

మనతో అన్నీ ఉంటే బంధువులైన రాబందువులైన మన దగ్గరకు వస్తాయి .. అలా కాకుండా ఏ మి ఆశించకుండా మనల్ని కంటికి రెప్పలా కాపాడుతూ వస్తుంది.. అందుకే అమ్మను దైవం అంటారు..బిడ్డ తెచ్చే పైసలను అమ్మ చూడదు.. కేవలం బిడ్డ ఆకలిని.. బిడ్డ ఎదుగుదలకు చూసి మురిసిపోతుంది..అందుకే అమ్మ ప్రేమ ముందు అన్నీ చిన్నవే .. గుడిలేని దేవత అమ్మ .. అలాంటి అమ్మ ఈ ప్రపంచం లో కన్నా భూమాత కన్నా మిన్నా.. సముద్రా నీ కన్నా ఎక్కువే.. అలాంటి అమ్మను డబ్బు వ్యామోహంలో పడి దూరం చేసుకోండి .. ప్రధాని మోదీ కూడా అమ్మ ప్రేమ ముందు చిన్నవాడే.. మన కంటిని మన వెలుతోనే పొడుచు కోకండి.. అమ్మను ప్రేమించండి.. మీ జీవితాన్ని సార్ధకం చేసుకోండి.. హెరాల్డ్ వీక్షకులకు హ్యాపీ మదర్స్ డే.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: