భారత దేశంలోకరోనా మహమ్మారి మనిషికి కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది.  ఎన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నా ప్రతిరోజూ కేసులు పెరిగిపోతూనే ఉన్నాయి.  భారత్‌లో కరోనా వైరస్ వ్యాప్తి, మరణాలు రోజురోజుకీ భారీగా పెరిగిపోతున్నాయి. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. గత 24 గంటల్లో భారత్‌లో 95 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో కరోనా మృతుల సంఖ్య మొత్తం 1,981 చేరింది.కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 59,662కు చేరింది. ఇప్పటి వరకు కరోనా నుంచి 17,847 మంది కోలుకోగా, ఆసుపత్రుల్లో  39,834 మంది చికిత్స పొందుతున్నారని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే.. ఇప్పుడు కరోనా కేసులు మాత్రం ఆ రెండు రాష్ట్రాల్లో బీభత్సం సృష్టిస్తున్నాయి.

 

 ప్రస్తుతం దేశంలో మూడో విడత లాక్‌డౌన్ నడుస్తున్నప్పటికి కరోనా ప్రభావం ఇంకా తగ్గడం లేదు. మన రెండు తెలుగు రాష్ట్రాలను పక్కన పెడితే మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్, తమిళనాడు వంటి కొన్ని రాష్ట్రాలలో కరోనా విళయతాండవం సృష్టిస్తుంది. నేడు ఒక్కరోజే మహారాష్ట్ర, తమిళనాడులో కలిపి రెండు వేలకు పైగా కేసులు నమోదు అయ్యాయంటే పరిస్థితి ఎలా ఉందనేది అర్ధం చేసుకోవచ్చు.  

 

ఓ వైపు ఇక్కడ లాక్ డౌన్ విషయంలో ఎంతో సీరియస్ గా ఉంటున్నారు ప్రజలు.. కానీ ఒక్కరోజే మహారాష్ట్రలో 1362 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. దీంతో తాజా కేసులతో కలిపి మహారాష్ట్రలో మొత్తం కేసుల సంఖ్య 18,120 కి చేరింది. ఇక తమిళనాడు విషయానికి వస్తే నేడు ఒక్కరోజే 580 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో తాజా కేసులతో కలిపి తమిళనాడు రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 5,409కి చేరింది. గత నాలుగు రోజుల నుంచి లాక్ డౌన్ సడలింపు చేసిన తర్వాత కేసులు పెరుగుతున్నాయని ప్రజలు అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: