అమ్మ ప్రేమ మధురం... ఈ జగత్తును సృష్టించిన అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే... ఈ సృష్టికి ప్రాణం పోసిన గొప్ప త్యాగమూర్తి అమ్మ. తన ప్రాణాన్ని పణంగా పెట్టి తొమ్మిది నెలలు మోసి... ఎవరు చూపించలేని ఆప్యాయత  అనురాగాలను చూపిస్తుంది అమ్మ. ఈ లోకంలో ఎవరి ప్రేమ అయినా మారుతుందేమో కానీ అమ్మ ప్రేమలో మాత్రం ఎప్పటికీ మార్పు ఉండదు. గుండె చప్పుడై నిలిచే ఊపిరి అమ్మ... అనురాగాలకు సాక్ష్యంగా ఆప్యాయతలకు నిలువుటద్దంగా.. నిజమైన ప్రేమకు కేంద్ర  బిందువుగా... నెత్తుటి చుక్కలకు ప్రేమగా మర్చి మనకు  ప్రాణం పోసిన దేవత  అమ్మ. అలాంటి అమ్మ గొప్పతనం గురించి ఎంత చెప్పినా తక్కువే. 

 

 ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న చాలామంది స్టార్ హీరోలు అమ్మను ఎంతగానో  ఆరాధించి పెరిగిన వారే . వీరిలో అక్కినేని వారసుడైన నాగచైతన్య అమ్మే  ప్రాణంగా బతికాడు.. దివంగత అగ్ర నిర్మాత అయిన దగ్గుబాటి రామానాయుడు తనయురాలు ఆయన గారాల పట్టి దగ్గుపాటి లక్ష్మిని... టాలీవుడ్ లో స్టార్ హీరోగా ఉన్న నాగార్జునకి ఇచ్చి వివాహం చేశాడు. అయితే వీరి జంట కొన్నాళ్లపాటు బాగానే ఉన్నప్పటికీ ఆ తర్వాత వచ్చిన మనస్పర్థల కారణంగా విడిపోగా.. అప్పటికే  వీరిద్దరికీ నాగచైతన్య పుట్టాడు. 

 

 

 అయితే నాగార్జునతో విడిపోయిన తర్వాత నాగచైతన్య తల్లి లక్ష్మీ వేరే వివాహం చేసుకుని అమెరికాలో సెటిల్ అయింది. అయితే మరో పెళ్లి చేసుకుని ఒక అమ్మాయికి జన్మనిచ్చినప్పటికీ దగ్గుబాటి లక్ష్మీ మాత్రం నాగచైతన్య ఎప్పుడూ వదలలేదు. నాగచైతన్య బాగోగులు చూస్తూ తల్లి బాధ్యతను తీసుకుంది.  తన తల్లి లక్ష్మీ నాగ చైతన్య మధ్య బంధం ఎంతో ఆప్యాయంగా అనురాగం గా సాగిపోయింది. ఇక నాగ చైతన్య సమంతల పెళ్లి కూడా దగ్గరుండి జరిపించింది లక్ష్మి. సమంతా కూడా అత్తగారు అంటే ఎంతో ఆరాధిస్తూ ఉంటుంది. అయితే తల్లి ప్రేమ గురుంచి  నాగచైతన్య గొప్పగా చెబుతూనే ఉంటాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: