అక్షయ్ కుమార్ భార్య పెళ్లి అయిన తర్వాత సినిమాలకు పూర్తిగా దూరం అవ్వడంతో పాటు... మీడియాకు అస్సలు కనిపించకుండా తన పిల్లల్ని, భర్తను బాగా చూసుకుంటుంది. 2001వ సంవత్సరంలో తను అక్షయ్ ని పెళ్లి చేసుకోగా.. వారి 19 ఏళ్ళ వైవాహిక జీవితంలో ఇద్దరు పిల్లల సంతానం కలిగింది. వారిలో ఒకరి పేరు ఆరవ్ కాగా... మరొకరి పేరు నితారా. గతంలో నటీమణిగా కొనసాగిన ట్వింకిల్ ఖన్నా మంచి రచయిత్రి కూడా. తాను సోషల్ మీడియాలో తరచుగా చలోక్తులు విసురుతూ అందరిని బాగా అలరిస్తుంది. ఈ 46 ఏళ్ల ట్వింకిల్ ఖన్నా ఈరోజు సాయంత్రం ట్విట్టర్ లో ఒక వీడియో పోస్ట్ చేసి మాతృ దినోత్సవ శుభాకాంక్షలు చాలా ప్రత్యేకంగా చెప్పి అందర్నీ ఆశ్చర్యపరిచింది. 

 

తాను తన ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్ట్ పెడుతూ... మాతృ దినోత్సవం రోజు అమ్మాలకు నిజంగా ఏం కావాలో తన పిల్లలకు చెప్పలేరు. మీరు ఎటువంటి అమ్మ చెప్పగలరా?' అని పేర్కొంటూ దానికే 1 నిమిషం నిడివిగల ఒక వీడియో ని జత చేసింది. ఆ వీడియోలో తాను మాట్లాడుతూ... " మాతృ దినోత్సవం రోజు ప్రతి అమ్మకు... నాకు కూడా ఏమి కావాలనేది నేను ఈరోజు చెబుతున్నాను. మాతృ దినోత్సవం రోజు మొత్తం నాకు అన్ని బాధ్యతల నుండి స్వాతంత్రం లభించాలి. పొద్దస్తమానం బ్లూ షర్ట్ ఎక్కడుంది, అది ఎక్కడ ఉంది ఇది ఎక్కడ ఉంది అని ఎవరూ నన్ను అడగకూడదు".

 


"ఇవే కాదు ఎవరు కూడా నన్ను ఏ ప్రశ్నలు అడగకూడదు. చదువు గురించి అయినా, లాక్ డౌన్ ఎప్పుడు ముగుస్తుందని, పరీక్షలు ఎప్పుడు పెడతారని, స్నేహితుల ఇంటికి నేను ఎప్పుడు వెళ్తానని ఇలాంటి ప్రశ్నలు నన్ను ఎవరు అడగకూడదు. నిజం చెప్పాలంటే... నాకు అమ్మ బాధ్యత నుండి పూర్తిగా లీవ్ తీసుకోవాలని ఉంది. మాతృ దినోత్సవం రోజు నన్ను నా పిల్లలు అమ్మ అని పిలవకుండా ఆంటీ అని పిలవాలి. అప్పుడే నేను నిజంగా అన్ని బాధ్యతల నుండి ఫ్రీ అయ్యానని ఫీల్ అవుతాను. నా మాటలు వింటున్న ప్రతి ఒక్కరు నేను చెడ్డ అమ్మని అని అనుకుంటారు... నేను ఏదైనా పని చేయకపోతే నా పిల్లలు కూడా నన్ను బ్యాడ్ మామా అని మొహం మీదే పిలుస్తుంటారు. కానీ నిజానికి నేను బ్యాడ్ మామ్ ని కాదు. నేను గట్స్ ఉన్న అమ్మని. అలాంటి అందరి అమ్మలకు నేను మాతృ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాను' అని ఆమె అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: