పాకిస్థాన్ దేశంలో సైనిక అధికారులుగా ఎంపిక కావాలన్నా... రాజకీయాల్లో ఉన్నత పదవులు రావాలన్నా వాళ్లు బాధ్యతాయుతంగా ఉండాల్సిన అవసరం లేదు. భారత్ పై ద్వేషం ఉన్న వాళ్లకు, భారత్ కు వ్యతిరేకంగా మాట్లాడే వాళ్లకు అక్కడ అవకాశాలు దక్కుతాయి. భారత్ ను ఏదో ఒక విధంగా దెబ్బ కొట్టాలని పాక్ ఎల్లప్పుడూ ఏదో ఒక పని చేస్తుంది. భారత్ కు వ్యతిరేకంగా ప్రవర్తించే వాళ్లకు పాక్ లో అవకాశాలు దక్కుతాయి. 
 
పాక్ లో ముఖ్య పదవులు అనుభవించిన నవాజ్ షరీఫ్, ముషారఫ్ భారత్ కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసి పదవులు పొంది ఆ తరువాత అక్కడి ప్రజలచే తిరస్కరించబడ్డారు. ఇప్పుడు ఆర్మీ చీఫ్ జనరల్ భజ్వా గిల్గిట్ బాల్టిస్తాన్ లో కొంత భూభాగాన్ని చైనా వాళ్లకు ఇచ్చి మొత్తాన్ని కూడా కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారు. దీంతో భారత్ అప్రమత్తమైంది. భారత్ ఇప్పటికే ఈ విషయంలో హెచ్చరికలు జారీ చేయడంతో సీరియస్ వాతావరణం నెలకొంది. 
 
రానున్న రోజుల్లో పాక్ ఎన్నికలు నిర్వహించే ప్రయత్నం చేస్తే భారత సైన్యం రంగప్రవేశం చేసి పాక్ ఆక్రమిత కశ్మీర్ ను భారత్ లోకి హస్తగతం చేసుకునే అవకాశం ఉంది. ఆ సమయంలో చైనా కూడా ఏం చేయలేదు. చైనా యుద్ధానికి వస్తే మాత్రం మూడవ ప్రపంచ యుద్ధానికి రంగం సిద్ధమయ్యే అవకాశం ఉంది. ఆ సమయంలో ప్రపంచ దేశాలు భారత్ కే మద్ధతు ఇచ్చే అవకాశం ఉంది. 
 
అమెరికా కూడా భారత్ కే మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. భజ్వా చేసిన చిన్న తప్పు వల్ల పీవోకే భారత్ సొంతం అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌(పీఓకే)లోని గిల్గిట్ బాల్టిస్తాన్‌, ముజఫరాబాద్‌లను జమ్మూ కశ్మీర్‌ సబ్‌ డివిజన్‌గా పేర్కొంటూ భారత వాతావరణ శాఖ నోటీసు జారీ చేయడంపై పాకిస్తాన్‌ అభ్యంతరం వ్యక్తం చేసింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: