గత మూడు రోజులనుండి కేరళ లో ఒక కరోనా కేసు మాత్రమే నమోదు కాగా ఈరోజు కొత్తగా రెండు కేసులు నమోదయ్యాయి. ఈనెల 7న దుబాయి నుండి వచ్చిన ఇద్దరు వ్యక్తులకు కరోనా సోకినట్లు వైద్యులు నిర్ధారించారు దాంతో రాష్ట్రం లో మొత్తం కేసుల సంఖ్య  505కు చేరగా అందులో 485 మంది బాధితులు కోలుకోని  ముగ్గురు మరణించారు.ప్రస్తుతం 17కేసులు మాత్రమే యాక్టీవ్ గా వున్నాయి. అయితే విదేశాల్లో వున్న భారతీయులను వెనక్కి రప్పించే కార్యక్రమం ఆపరేషన్ వందేమాతరంకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. అందులో భాగంగా కేరళలో మరి కొన్ని కేసులు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 
ఇక  మిగితా దక్షిణాది రాష్ట్రాల విషయానికి వస్తే తమిళనాడులో కరోనా విజృంభణ కొనసాగుతుంది.  ఈరోజు కొత్తగా మరో 526 కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 6535కి చేరింది. ఆలాగే ఆంధ్రపదేశ్ లో కూడా రఈరోజు మరో 43కేసులు నమోదు కాగా మొత్తం కేసుల సంఖ్య 1930కి చేరింది. కర్ణాటక లో ఈరోజు 41 కేసులు నమోదు కాగా తెలంగాణలో కూడా  ఈరోజు భారీగా కేసులు నమోదయ్యాయని సమాచారం. దానికి సంబందించిన హెల్త్ బులిటెన్ విడుదలకావాల్సి వుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: