కొద్ది రోజులుగా టీడీపీ అధినేత ఏపీ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు వ్యవహారశైలిపై అనేక అనుమానాలు తలెత్తుతున్న సంగతి తెలిసిందే. చంద్రబాబు తరచుగా అసంబద్ధంగా చేస్తున్న వ్యాఖ్యలకు వైసిపి నాయకులు అదే స్థాయిలో కౌంటర్ ఇస్తున్నారు. దానిలో భాగంగానే ఈ రోజు వైసిపి మంత్రి , ఫైర్ బ్రాండ్ నాయకుడు కొడాలి నాని తీవ్ర స్థాయిలో చంద్రబాబుపై విమర్శలు చేశారు. ఈ సందర్భంగా ఆయన అనేక ఆసక్తికర విషయాలను బయటపెట్టారు. ఏపీ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబుకు మరో నాలుగు రోజుల్లో ఆ పదవి పోతుంది అంటూ ఆయన వ్యాఖ్యానించారు. 

 
 
విశాఖలో ఎల్జి పాలిమర్స్ ప్లాంట్ లో గ్యాస్ లీక్ అయిన అంశంపై తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్న విమర్శలకు కొడాలి నాని తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. అసలు ఈ ఫ్యాక్టరీ విస్తరణకు చంద్రబాబు హయాంలోనే అనుమతులు వచ్చాయని, చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ కంపెనీ లో అగ్ని ప్రమాదం జరిగితే అప్పుడు ఎందుకు కంపెనీని మూసివేయి లేదంటూ నాని ప్రశ్నించారు. ఈ సంఘటనపై వైసీపీ ప్రభుత్వం ఐఎఎస్ లతో కమిటీని నియమించడం పైన చంద్రబాబు విమర్శలు చేయడాన్ని నాని తప్పు పట్టారు. అచ్చెన్న నాయుడు తో ఈ ఘటనపై టిడిపి కమిటీ వేసిందని, వారికి ఏమైనా దీని గురించి తెలుసా అంటూ నాని చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు. కోటి రూపాయలు ఇస్తే ప్రాణాలు తీసుకు వస్తారా అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను కూడా నాని తప్పు పట్టారు. 
 
 
గత టిడిపి ప్రభుత్వంలో నిర్వహించిన గోదావరి పుష్కరాల సమయంలో చంద్రబాబు వీడియో షూటింగ్ చేయించుకున్నారని, దీనికోసం 30 మందిని బలి తీసుకున్నారు అని, వారికి కేవలం మూడు లక్షలు మాత్రమే ఇచ్చారని విమర్శించారు. ఈ సందర్భంగా చంద్రబాబు ప్రతిపక్ష నాయకుడు హోదా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే టీడీపీ లో ఉన్న 23 మంది ఎమ్మెల్యేలు కరణం బలరాం, వల్లభనేని వంశీ, మద్దాల గిరి వంటివారు దూరమయ్యారని, మరికొంతమంది టీడీపీకి దూరం అయ్యేందుకు సిద్ధంగా ఉన్నారని, వారు కూడా వచ్చేస్తే చంద్రబాబుకు ప్రతిపక్ష నాయకుడు హోదా కూడా దూరమవుతుందని నాని వ్యాఖ్యానించారు. ఇవే కాకుండా చంద్రబాబును టార్గెట్ చేసుకుని అనేక విమర్శనాస్త్రాలు నాని వదిలారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: