ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రానున్న రోజుల్లో కరోనా వైరస్ తో జీవించడం తప్ప చేసేదేమీ లేదని ప్రకటించడం జరిగింది. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం కూడా మే 17 తర్వాత పరిస్థితి ఏమిటి అన్న దాని గురించి వస్తున్న వార్తల విషయంలో ‘కరోనాతో కలసి జీవించడం’ నేర్చుకోవాలి అని తెలిపింది. కరోనా వైరస్ ని ఎదుర్కోవడం కోసం కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ఇప్పటికే మూడుసార్లు పొడిగించడం జరిగింది. అయినా కానీ దేశంలో ఎక్కడా పరిస్థితులు వైరస్ కంట్రోల్ అయిన దాఖలాలు కనబడటం లేదు. ఇటువంటి సందర్భంలో కేసులు పెరుగుతున్న క్రమంలో లాక్ డౌన్ ను కొన‌సాగిస్తే ఎన్ని అన‌ర్థాలు జ‌రుగుతాయో అంతుబ‌ట్ట‌ని ప‌రిస్థితి నెల‌కొంది.

 

ఒకపక్క రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయం లేకుండా పోవడంతో ఇంటికి పరిమితమైన జనాల నుండి కూడా వ్యతిరేకత తారాస్థాయిలో వస్తున్న తరుణంలో ఉన్న వాస్తవాన్ని జగన్ డైలాగ్ ని కేంద్రం ఇప్పుడు వాడింది. అప్పట్లో జగన్ ఇదే కామెంట్లు చేసిన సమయంలో తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు మరియు మీడియా ఇష్టానుసారం అయిన వ్యాఖ్యలు చేయడం జరిగింది. కరోనా వైరస్ ని సమర్థవంతంగా జగన్ ఎదుర్కోలేక పోయాడని అనేక విమర్శలు చేయడం జరిగింది.

 

అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వం కూడా జగన్ చెప్పినట్లు తెలపడంతో జనాలు తెలుగుదేశం పార్టీని విమర్శిస్తూన్నారు.  ఉన్నది ఉన్నట్టు చెప్పటం లో జగన్ ని మించిన వారు మరొకరు లేరని తెగ పొగుడుతున్నారు. ఏటువంటి పరిస్థితి బయట ప్రపంచం లో ఉందో దానికి తగ్గట్టుగానే జగన్ మాట్లాడటం జరిగిందని.. ఏదో రూపంలో రాజకీయ లబ్ది పొందాలని టిడిపి ఆయన నిర్ణయాన్ని వ్యతిరేకించడం సిగ్గుచేటుగా అభివర్ణిస్తున్నారు. దీంతో వాళ్ళు చేసిన విమర్శలు వాళ్ళ పైకి రావటం మరోపక్క జగన్ నీ పొగడటం తో టిడిపి జగన్ పైన పాలు పోసినట్లయింది. ఇంకోపక్క యూరప్ దేశాలు అదేవిధంగా శాస్త్రవేత్తలు కూడా భవిష్యత్తులో కరోనా వైరస్ తో బతకడమే నేర్చుకోవాలని అని అంటున్నారు.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: