విశాఖపట్నం గ్యాస్ లీకేజీ ఘటన సందర్భంలో బాధితులను ఉద్దేశించి జగన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెను దుమారాన్ని రేపుతున్నాయి. జగన్ మాట్లాడుతూ...‘ఎల్ జి పాలిమర్స్ మల్టీ నేషనల్ కంపెనీ. మృతుల కుటుంబాలకు రూ కోటి పరిహారం అందించేలా చూస్తా. ఎల్ జి సంస్థ ఏ మేరకు పరిహారం ఇస్తుందో చూస్తాం. ఆ పై సాయం ప్రభుత్వం నుంచే అందిస్తాం. చనిపోయిన వారి కుటుంబాల్లో ఒకరికి ఎల్ జి కంపెనీలో ఉద్యోగం ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశిస్తున్నా. సంస్థను తిరిగి ప్రారంభించాక అక్కడే ఉన్నా, వేరే చోటకు తరలించినా బాధిత కుటుంబాలకు ఉపాధి చూపిస్తామని’’ అని అన్నారు.

 

దీంతో ఈ వ్యాఖ్యలను తీవ్రస్థాయిలో ఖండిస్తున్నారు ప్రతిపక్ష నేత చంద్రబాబు. అప్పట్లో కరోనా వైరస్ వచ్చిన ప్రారంభంలో ఈ విధంగానే చాలా తేలిగ్గా తీసుకున్నారు..‘‘అదేదో చిన్న జ్వరం, పారాసిటమాల్ వేసుకుంటే పోతుందని, బ్లీచింగ్ జల్లాలని’’ అని మాట్లాడారు తర్వాత భయంకరమైన ప్రమాదం గా వైరస్ మారింది. అయితే ఈ గ్యాస్ లీకేజీ విషయం చాలా తేలికగా తీసుకోవాల్సిన అంశం కాదు నేరం జరిగినప్పుడు బాధితులను దృష్టిలో పెట్టుకొని ఆలోచించాలని మహాత్మా గాంధీ చెప్పారు.

 

ఈ సందర్భంగా బాధితులను దృష్టిలో పెట్టుకుని మాట్లాడాలి తప్ప పరిశ్రమ యాజమాన్యం ని వెనకేసుకుని మాట్లాడరాదని తెలిపారు. జగన్ ఈ విషయాన్ని తేలిగ్గా తీసుకోవడం కరెక్ట్ కాదు... ఏదేదో చెప్పేసి 278, 284, 285, 337, 338(2) సెక్షన్ల కింద కేసు బుక్ చేస్తే చాలదు. సింపుల్ కేసులు పెట్టి నార్మల్ గా ఈ కేసును పరిగణించడం కరెక్ట్ కాదు. దీని దుష్ప్రభావం దీర్ఘకాలంగా ఉంటుంది కాబట్టి సరైన చర్యలు చేపట్టాలని ప్రతిపక్ష నేత చంద్రబాబు కోరుతున్నారు. దీంతో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో పెద్ద హాట్ టాపిక్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: