కరోనా వైరస్ కారణంగా దేశంలో రాజకీయ సమీకరణాలు మొత్తం మారిపోతున్నాయి. కేంద్రంలో గత కొన్ని సంవత్సరాల నుండి తిరుగులేని జాతీయ నాయకుడిగా మోడీ రాణిస్తున్నారు. ప్రతిపక్షాలు మరియు పార్టీలకతీతంగా రాష్ట్రాల కతీతంగా మోడీ దూసుకుపోతున్న విషయం అందరికీ తెలిసినదే. ఇలాంటి సంక్షోభం సమయంలో చాలా సమర్థవంతంగా నిర్ణయాలు తీసుకుని ఈ మహమ్మారి దేశంలో విస్తరించకుండా నిర్మాణాత్మకమైన పాత్ర పోషించడం జరిగింది. కరోనా వైరస్ కట్టడి చేయడంలో విదేశాల నుండి వచ్చిన వారిని గుర్తించడంలో సక్సెస్ సాధించడం జరిగింది. కానీ తాజా పరిస్థితులు వల్ల ప్రజల్లో అసహనం పెరుగుతోంది. దీనివల్ల మరోపక్క దేశంలో పూర్తిగా కనుమరుగు అవుతున్న కాంగ్రెస్ పార్టీకి ఊపిరిపీల్చుకున్న ఛాన్స్ ఏర్పడినట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

 

కరోనా వైరస్ కట్టడి చేయటానికి లాక్ డౌన్ గత 40 రోజులకు పైగాఅమలు చేస్తూ ఉన్నాగాని వైరస్ ను ఏమాత్రం కంట్రోల్ చేయలేని పరిస్థితులు దేశం లో ఏర్పడ్డాయి. మరో పక్కన లాక్ డౌన్ అమలు చేయటం వల్ల రాష్ట్రాలకు ఆదాయం లేకుండా పోయింది. ఇటువంటి సమయంలో కరోనా వైరస్ కట్టడి కోసం రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించిన పనులకి కేంద్రం నుండి నిధులు ఇవ్వటానికి ముందుకు రాకపోవటంతో దేశవ్యాప్తంగా ఉన్న రాష్ట్రాలు కూడా బిజెపి పార్టీ పై మండి పడుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రాలలో మద్యం దుకాణాలు ఓపెన్ చేసుకోవచ్చని వాటి వల్ల వచ్చే ఆదాయం తో సంక్షోభం నుండి రాష్ట్రాలు పైకి రావాలని కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ తప్పుపట్టడానికి రెడీ అయ్యింది.

 

ఇదే టైం లో కేంద్రంపై రాష్ట్రాలకు ఉన్న వ్యతిరేకతను అందిపుచ్చుకుని కేంద్ర ప్రభుత్వం కరోనా వైరస్ విషయంలో చేసిన వైఫల్యాలను లేవనెత్తడానికి రెడీ అవుతుంది. ముఖ్యంగా ఆర్థికంగా అన్ని రాష్ట్రాల్లోనూ దెబ్బ కొట్టిన బీజేపీని మోడీని అదే స్థాయిలో ఇరకాటంలో పెట్టాలని ఆర్థికవేత్తల తో కాంగ్రెస్ పార్టీ నేతలు చర్చలు జరుపుతున్నారు. మోడీ నల్లధనం నుండి లాక్ డౌన్ వరకు ఆర్థికంగా నష్టపోయే తీసుకున్న నిర్ణయాలను లేవనెత్తి ఇరకాటంలో పెట్టడానికి కాంగ్రెస్ పార్టీ రెడీ అయ్యింది. ఈ విషయంలో సక్సెస్ అయితే దశాబ్దకాలం పాటు కోల్పోయిన బలాన్ని కొద్దిరోజుల్లోనే సంపాదించుకోవచ్చు కాంగ్రెస్ అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. 

మరింత సమాచారం తెలుసుకోండి: