రాష్ర్టంలో కరోనా కేసులు  తగ్గుముఖం పడుతున్నాయని ప్రభుత్వ పెద్దలు  చెబుతుంటే ,  పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా కన్పిస్తోంది . హైదరబాద్ నగరంలో కేసుల తీవ్రత ఇప్పటి వరకూ పాతనగరానికే  పరిమితం కాగా , తాజాగా  నగర శివారు ప్రాంతాల్లోనూ కరోనా కేసుల అధిక మొత్తం నమోదు కావడం ప్రజల్ని భయాందోళనల కు  గురి చేస్తోంది . ప్రభుత్వ పెద్దలు చెబుతున్నదానికి , క్షేత్రస్థాయిలో వాస్తవ  పరిస్థితులకు పొంతన అన్నది లేకుండాపోతోంది .


ఒక్క  ఎల్‌బీ నగర్‌ ప్రాంతం లోనే  ఇప్పటి వరకు  57  కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక  ఇప్పటి వరకు కరోనాతో ఐదు మంది కరోనా సోకి  మృతి చెందారు.  వనస్థలిపురంలో 26 కేసులు, బీఎన్‌రెడ్డి ఎస్‌కేడీ నగర్‌లో రెండు కరోనా కేసులును అధికారులు ఇప్పటి వరకు  గుర్తించారు.  హయత్‌నగర్ ద్వారక మాయి నగర్, సాయినగర్, సచివాలయ కాలనీలో 11 కేసులు నమోదు కాగా,  నాగోల్, లింగోజిగూడ డివిజన్లలో ఒక్కోక్క  కరోనా పాజిటివ్ కేసుల ను అధికారులు గుర్తించారు .    ఎల్‌బీ నగర్‌ లో రోజు రోజుకు కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపధ్యం లో మూలలను గుర్తించే పని లో అధికారులు నిమగ్నమయ్యారు .

 

వీటికి సూర్యాపేట జిల్లా నుంచి లింక్ ఉన్నట్లు గుర్తించిన అధికారులు , లింక్ ను చేధించేందుకు స్థానికంగా 15 కంటైన్ మెంట్ జోన్లను ఏర్పాటు చేసి , కరోనా కట్టడికి ప్రయత్నాలు చేస్తున్నారు . అయితే రాష్ట్రంలోని ఇతర జిల్లాలతో పోలిస్తే హైదరాబాద్ . రంగారెడ్డి , మల్కాజిగిరి మేడ్చల్  జిల్లాల్లోనే ప్రస్తుతం అధికసంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నట్లుగా అధికారులు అంగీకరిస్తున్నారు . అందుకే హైదరాబాద్ నుంచి నగరవాసులను ఇతర జిల్లాలకు వెళ్లకుండా . ఇతర జిల్లాల వాసుల్ని నగరానికి రాకుండా కట్టడి చేయడం ద్వారా కరోనా వ్యాప్తిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు . 

మరింత సమాచారం తెలుసుకోండి: