రాజకీయాలకు క్రికెట్ పరిభాషను కనుక ఉపయోగిస్తే ప్రత్యర్ధిని క్లీన్ బౌల్డ్ చేయడం అంటే అర్ధం అవుతుంది. ఏపీ రాజకీయాలు తీసుకుంటే విపక్షాల్లో చాలానే స్టార్లు ఉన్నారు. అయితే ఎవరినీ క్రీజ్ లో ఉండనీయకుండా చేయడంలో జగన్ సక్సెస్ అవుతున్నారు. నాటౌట్ అంటున్న చంద్రబాబునే జగన్ అలా సెల్ఫ్ క్వారంటైన్ లో ఉంచేశారు.

 

ఇక పవన్ కళ్యాణ్ అయినా మరో నేత అయినా జగన్ని ఏమీ అనలేని పరిస్థితి ఉంది. విశాఖలో గ్యాస్ లేకేజి ఇష్యూని జగన్ టేకప్ చేయడంలో చూపించిన రాజకీయ చాతుర్యం ఇపుడు విపక్షాలకు చెక్ పెట్టిందనే చెప్పాలి. విపక్షాలు ఈ విషయంలో వీలైనంత ఎక్కువగానే పొలిటికల్ గైన్ పొందాలనుకున్నాయి. కానీ జగన్ ఎవరి ఊహకూ అందని విధంగామరణించిన వారికి ని కుటుంబానికి ఒక్కొక్కరికీ  కోటి రూపాయల పారితోషికం ప్రకటించి విపక్షాల నోళ్ళు మూయించారు.

 

ఇపుడు అలా కాదు, ఫ్యాకటీ యజమానిని అరెస్ట్  చేసి ఫ్యాక్టరీని మూయించమంటూ కొత్త డిమాండ్ తో ప్రతిపక్షాలు ముందుకు వస్తున్నాయి. ఈ విషయంలో కూడా జగన్ అదిరిపోయే ప్లాన్ వేశారు. నిజానికి ఈ ఫ్యాక్టరీ చంద్రబాబు పుణ్యంతోనే విస్తరణకు అనుమతులు సంపాదించుకుంది. బాబు సీఎం గా ఉండగానే కర్మాగారం తాళాలు హిందుస్థాన్ నుంచి దక్షిణ కొరియా చేతికి వచ్చాయి.

 

అవన్నీ  ఎలా ఉన్నా బాబుతో పాటు మొత్తం విపక్షాన్ని పూర్తిగా ఇరకాటంలో పడేయడానికి జగన్ మరో కొత్త స్కీం రెడీ చేశారట.  అదేంటి అంటే ఈ కర్మాగారంతో పాటు, ప్రమాదభరిత కర్మాగారాలు ఎన్ని ఉంటే అవన్నీ కూడా జన వాసాలకు దూరంగా ఉంచాలని జగన్ నిర్ణయం తీసుకున్నారట.

 

విశాఖ సేఫ్ జోన్ లో ఉందని, అక్కడ ప్రజలకు ఎటువంటి ఇబ్బందీ లేదని చెప్పడానికి జగన్ తీసుకుంటున్న ఈ సంచలన నిర్ణయంతో పాటు ప్రమాణాలు పాటించని కర్మాగారాలకు ఏకంగా తాళాలు వేయాలని కూడా కీలక నిర్ణయం తీసుకోవడంతో విపక్షాలకు ఇక రాజకీయం చేసే అవకాశం అసలు ఉండదని అంటున్నారు. మొత్తం మీద చూసుకుంటే జగన్ మార్క్ పాలిటిక్స్ తో ఏపీ విపక్షం కంప్లీట్ గా క్లీన్ బౌల్డ్ అవుతోందనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: