విశాఖ ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమలో జరిగిన ఘోర విషవాయువు లీకేజీ ఘటన ఏపీ రాజకీయాల్లో కలకలం సృష్టిస్తోంది. ఈ ఘటనపై వెంటనే స్పందించిన సీఎం జగన్.. వెంటనే విశాఖ వెళ్లి బాధితులను పరామర్శించారు. బాధిత కుటుంబాలకు భారీ నష్టపరిహారం ప్యాకేజీ ప్రకటించారు. మరణించిన వారి కుటుంబాలకు కోటి రూపాయల నష్టపరిహాం ఇస్తామన్నారు. అంతే కాదు.. చెప్పిన 24 గంటల్లోనే నిధులు విడుదల చేసేశారు కూడా.

 

 

అయితే ఈ విషయంపై ప్రతిపక్ష టీడీపీ మాత్రం మండిపడుతోంది. జగన్ ఈ ఇష్యూని సీరియస్ గా డీల్ చేయలేదని చంద్రబాబు మండిపడుతున్నారు. అంతే కాదు.. కోటి రూపాయల పరిహారం ఇస్తే మాత్రం వారు బతికొస్తారా అని ప్రశ్నిస్తున్నారు. ప్రమాదం ఇష్యూని రాజకీయం చేసేందుకు శతథా ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిపై వైసీపీ నాయకులు మండిపడుతున్నారు. కోటి రూపాయలు ఎక్స్‌గ్రేషియా ఇస్తే మనుషులు బతికి వస్తారా అని చంద్రబాబు ప్రశ్నిస్తున్నారు. మరి ఇదే చంద్రబాబు గోదావరి పుష్కరాల్లో 29 మంది చనిపోతే ఒక్కొక్కరికి రూ.3 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇచ్చారెందుకని ప్రశ్నిస్తున్నారు.

 

 

అంటే వాళ్లు బతికి వస్తారని ఎక్స్‌గ్రేషియా ఇచ్చారా? ఆ రోజు పుష్కరాల్లో సినిమా షూటింగ్‌ పెట్టి, డైరెక్టర్‌ బోయపాటితో చంద్రబాబు, ఆయన భార్య, కుమారుడు కలిసి గోదావరిలో స్నానం చేసే సమయంలో షూటింగ్‌ పెడితే ..ఆ తొక్కిసలాటలో 29 మంది చనిపోయారు. 2014లో పైప్‌ లీక్‌ అయి 18 మంది చనిపోతే.. గేల్‌ కంపెనీ వాళ్లు రూ.20 లక్షలు ఇస్తే.. చంద్రబాబు ప్రభుత్వం రూ.3 లక్షలు మాత్రమే ఇచ్చారని వైసీపీ నాయకులు గుర్తు చేస్తున్నారు.

 

 

అంతే కాదు.. విశాఖ ఘటనను టీడీపీ అనుకూల మీడియా, చంద్రబాబు మనుషులు రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారని వైసీపీ నాయకులు మండిపడుతున్నారు. విశాఖ ప్రాంత ప్రజలకు వైయస్‌ జగన్‌ తోడుగా ఉంటే.. టీడీపీ ళ్లు పుల్లలు పెట్టడం, పెట్రోలు పోయడం వంటి చెత్త పనులు చేస్తున్నారని వైసీపీ నాయకులు మండిపడుతున్నారు. మొత్తానికి చంద్రబాబును గోదావరి పుష్కరాల ఘటన వెంటాడుతూనే ఉంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: