ఆడపిల్ల అని తెలిసి కడుపులోనే చంపేస్తున్నా ఆ రోజుల్లో ఆడపిల్ల పుట్టిన ఎంతో ప్రేమగా పెంచి పోషించి మంచి చదువు చెప్పి సరిగ్గా ఇంట్లో వాళ్ళకి కడుపు నిండా అన్నం పెట్టడానికి ఉద్యోగానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్న  ఆడపిల్లను మానవ మృగాలు గ్యాంగ్ రేప్ చేసి.. శారీరకంగా హింసించి.. శరీరంలో కోన ఊపిరి తప్ప లోపల బాడీ పార్ట్శ్ అన్నింటిని నాశనం చేసి కన్నకూతురుని కాటికి పంపిస్తే ఏ తల్లి అయినా ఏడవకుండా ఎందుకు ఉంటుంది. 

 

గుండెలు పగిలేలా ఏడిచింది.. ఒక్క ఆ తల్లి మాత్రమే కాదు.. మొత్తం లోకం అంత ఈ ఘటనపై స్పందించారు.. ఆడపిల్లని ఇంత దారుణంగా గ్యాంగ్ రేప్ చంపారు అని తెలుసుకొని ప్రజలు ఆగ్రహానికి గురయ్యారు... వారందిరికి వెంటనే మరణశిక్ష వెయ్యాలి అని ప్రజలంతా నినాదాలు చేస్తున్నారు.. ప్రజలకు అప్పగిస్తే కేవలం ఒక 10 నిమిషాల్లో ఆరు మంది ప్రాణాలు తీస్తారు.. కానీ మన చట్టం అందుకు సిద్ధంగా లేదు.. అందుకే వాళ్ళని చంపలేదు.. 

 

అధరాలు అని.. అది అని ఇది అని కేసు వాయిదాల మీద వాయిదాలు పడుతూనే ఉంది.. తన బిడ్డ పోయింది.. ఇంకా నాకెందుకు ఈ కోర్టు.. పోలీస్ స్టేషన్ అని ఆ తల్లి పక్కన కూర్చోలేదు.. ఆ మానవ మృగాలకు శిక్ష పడాలి.. నాలుగురు కుక్క చావు చావాలి అని కాళ్ళు అరిగేలా కోర్టు చుట్టూ తిరిగింది.. ఆరుమందిలో ఒకడు జైల్లోనే ఉరేసుకొని చచ్చాడు.. మరొకడు మైనర్ అని మూడేళ్లు జైలు శిక్ష వేసి పంపారు.. 

 

ఆమె కోర్టుకు వెళ్లిన ప్రతిసారి కన్నీళ్లు పెట్టుకుంది. ఆ మానవ మృగాలకు సంబంచిన లాయర్ అతి దారుణంగా ఆమెపై మాట్లాడాడు.. కానీ అన్యాయం జరిగింది నిర్భయకు కదా.. ఆమె కూతురుకు కదా! ఒక్క సంవత్సరం కాదు.. రెండు సంవత్సరాలు కాదు.. ఏకంగా 8 ఏళ్ళు.. 8 ఏళ్ళు ఆ నలుగురు జైల్లో కూర్చొని దున్నపోతుల్లా మేశారు.. ఉరి శిక్ష రేపు పడుతుంది అనుకున్న ప్రతి సారి ఆ లాయర్ వాయిదా వేపించాడు.. ఆ వాయిదాలు చూసి చూసి కోర్టుకే విసుగొచ్చింది. కానీ తల్లి కోరిక తీరలేదు.. కోపం వచ్చింది.. చంపేయాలి అనిపిస్తుంది.. ఎం చెయ్యాలో తెలీదు.. కూతురుకు న్యాయం జరగాలి అని పనులు అన్ని అపి మండుటెండలో కోర్టుకు హాజరయ్యేది.. అన్నింటికి ఫలితం ఉంది.. చివరికి కూతురికి న్యాయం జరిగింది.. ఆమె పోరాటం వల్ల కూతురుకి న్యాయం జరిగింది అని ఆ తల్లి గెలుపు వెనుక ఆనందం చూస్తే ఇప్పటికి కన్నీళ్లు వస్తాయ్.. తల్లి ప్రేమ అంత గొప్పది మరి.   

మరింత సమాచారం తెలుసుకోండి: