భారత రాజకీయాల్లో ప్రభావం చూపించిన నాయకుల్లో వెంకయ్య నాయుడు ఒకరు. నేడు ఆయన రాజకీయాల్లో రాణించడానికి గానీ నేడు ఉప రాష్ట్రపతి అవ్వడానికి గానీ ఆయన చేసిన కృషి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. చిన్న కుటుంబం నుంచి అడుగు పెట్టిన ఆయన నేడు భారత రాజకీయాల్లో తన ప్రభావం చూపిస్తున్నారు. ఆయన నేడు ఇలా ఉండటానికి ప్రధాన కారణం ఆయన వ్యూహాలు ఆయన చతురత అయితే ఆయన తల్లి ప్రోత్సాహం చాలా ఎక్కువగా ఉండేది అని చెప్తూ ఉంటారు. 

 

భారత రాజకీయాల్లో ఆయన ఎంతో ప్రభావ౦ చూపించారు. జనతా పార్టీ ఆవిర్భవించిన సమయంలో ఆయన యువనేత గా ఉన్నారు. అప్పుడు వాజపేయి సహా మరికొందరు నేతలు జనతా పార్టీలో కీలకంగా ఉండే వారు. ఇందిరా గాంధి ఎమర్జెన్సి విధించిన సమయంలో వెంకయ్య చాలా ఇబ్బందులు పడుతూ ఉండే వారు అని చెప్తారు. ఆయన అప్పుడు బయటకు చెప్పుకోలేని విధంగా బాధలు పడ్డారు అని అంటారు. ఆ సమయంలో ఆయనకు బాగా ప్రోత్సాహం అందింది మాత్రం ఆయన తల్లి నుంచే అనేది చాలా మంది చెప్పే మాట. ఆమె ఆయన్ను అన్ని విధాలు గా ముందుకు నడిపి౦చారు అని అంటారు. 

 

ఎమర్జెన్సి సమయంలో ఎక్కువగా యువ నాయకులను అప్పటి ప్రధాని ఇందిరా గాంధి టార్గెట్ చేసారు. అయినా సరే ఎక్కడా కూడా భయపడకుండా ఆయన రాజకీయం చేసారు. ఆయనను అరెస్ట్ చేసి జైలుకి తరలించిన సమయంలో కూడా తల్లి నుంచి చాలా మద్దతు వచ్చింది అని అంటారు. ఆమె ఆయన ఆర్ధిక వ్యవహారాలను కూడా చాలా జాగ్రత్తగా చూసి వెంకయ్య కు అండగా నిలబడ్డారు అని అంటారు. రాజకీయాల్లో ఆయన ఆసక్తిని గమనించి తీసుకొచ్చారు అని చెప్తారు. ఆయన ఈవితంలో ప్రతీ విజయ౦ వెనుక తల్లి ఉందని అంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: