లోకంలో ఎవరికి రానన్ని కష్టాలు మందు బాబులకు వచ్చాయి.. అసలు మద్యంతోనే ప్రభుత్వ ఖజానాకు కళ వస్తుంది అన్నవిషయం తెలిసిందే.. ఒక తాగుబోతు కష్టాలను ఎవరు పట్టించుకునే వారు లేరని మందుబాబులు లోలోన ఎంత బాధపడుతున్నారో పాపం.. మందు తాగినాక పోలీసులకు చిక్కకుండా ఇంటికి చేరాలి.. ఇంటికెళ్లాక పెళ్ళాంతో  నస అనుభవించాలి.. తాగడానికి డబ్బులు లేకుంటే అప్పులు చేయాలి.. అప్పు పుట్టకుంటే ఎవర్నో ఒక ఫ్రెండ్‌ను పట్టుకుని వాడికి కాసేపు భజన చేసి గ్లాస్ మందు సాధించాలి.. అబ్బబ్బ ఇన్ని ఉంటాయి తాగుబోతుల బాధలు.. అని ఎందరో మద్యం ప్రేమికులు తమలో తామే ఈ కష్టాలన్ని వల్లె వేసుకుంటారట..

 

 

ఇకపోతే ఈ కరోనా సమయంలో మందు దొరక్క ఎందరో మందుబాబులు అష్టకష్టాలుపడ్డారు.. చివరికి వారి బాధను అర్ధం చేసుకున్న ప్రభుత్వాలు ఎలాగోలా ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకుని కొన్ని కట్టుబాట్ల మద్య, మద్యం అమ్మకాలు మొదలు పెట్టింది.. ఇదిలా ఉండగా కొన్ని దేశాల్లో ఇంకా లాక్‌డౌన్ ముగిసిపోలేదు.. మరి అక్కడి తాగుబోతులకు మద్యం సరఫరా ఎలా అంటే.. మనిషి తెలివికి, పుట్టవంటి వాడుకదా.. అందుకే డ్రోన్ల ద్వారా మందు సరఫరా చేయడం మొదలు పెట్టాడు..

 

 

ఐర్లాండ్‌లోని రాథ్‌ద్రినాగ్ అనే గ్రామంలో మెక్‌కీవర్స్ బార్ అండ్ లాంజ్ 152 ఏళ్ల నుంచి ఎందరో తాగుబోతులకు సేవలు అందిస్తుందట.. కానీ ఈ మధ్యకాలంలో ఆ దేశంలో లాక్‌డౌన్ విధించడంతో ప్రజలు ఇళ్లకే పరిమితం కావాల్సి వచ్చింది. దీంతో రెగ్యులర్ కస్టమర్లు కూడా బార్‌కు వచ్చే పరిస్థితుల్లో లేరు. ఇలాంటి సమయంలో తమ వ్యాపారం నష్టపోకుండా, కస్టమర్లను కాపాడుకునేందుకు ఈ బార్ యాజమాన్యం వినూత్న ఐడియాతో ముందుకొచ్చింది.

 

 

ఇందులో భాగంగా డ్రోన్ల ద్వారా తమ కస్టమర్లకు మందును అంజేయాలని నిర్ణయించింది. అంతే కాకుండా మందు ఆర్డర్ చేసిన కస్టమర్లకు మందుతో పాటు బంగాళాదుంప చిప్స్‌ను కూడా డ్రోన్ ద్వారా వారి ఇళ్లకు చేర్చుతున్నారు. కాగా.. ఐర్లాండ్‌లో మార్చి నుంచి లాక్‌డౌన్ అమలవుతుండగా దీన్ని ఆగస్ట్ 10 వ తేదీ వరకు పొడిగించినట్టు ప్రభుత్వం ప్రకటించింది... 

మరింత సమాచారం తెలుసుకోండి: