ప్రపంచంలో కరోనా మొదటి ఇన్నింగ్స్ విజయవంతంగా ముగించింది.. ఈ సీజన్‌లో కరోనా దాడికి ఎన్ని ప్రాణాలు గాల్లో కలిసిపోయాయో, ఎన్ని కుటుంబాలు అనాధలుగా వీధిన పడ్డాయో.. ఫస్ట్ సీజనే ఇలా ఉంటే, రెండో సీజన్ కనుక వస్తే పరిస్దితిని ఊహించడం కష్టం.. ఇప్పటికే ఈ కరోనా పేదవారికి కన్నీటిని తప్పితే ఏం మిగల్చలేదు.. ఇదిలా ఉండగా ఈ వైరస్ వల్ల చాలామంది జీవితాల్లో చీకట్లు అలుముకున్నాయి.. ఎందరో పసివారు తల్లిదండ్రులను కోల్పోయి అనాధలుగా మిగిలారు.. ఒక్కో కుటుంబానిది ఒక్కొక్క వ్యధ..

 

 

ఇకపోతే లోకం సరిగ్గా తెలియని ఓ పదేళ్ల బాలుడు తన తండ్రి మృతదేహంతో 14 గంటల పాటు ఒంటరిగా గడపాల్సి వచ్చింది. ప్రతి మనసును కదిలించే ఈ ఘటనకు సంబంధించిన వివరాలు తెలుసుకుంటే..  చెన్నై విల్లుపురం జిల్లా కండాచ్చిపురం సమీపంలోని నల్లపాళయంలో అయ్యనార్‌(35) అతని కుటుంబంతో నివాసం ఉంటున్నాడు.. ఈ క్రమంలో ఇతని భార్యకు, తల్లికి కరోనా సోకడంతో వారిద్దరు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. కాగా అయ్యనార్ తన పదేళ్ల కొడుకుతో కలిసి జీవిస్తుండగా.. ఇటీవల అయ్యనార్‌ ప్రమాదానికి గురయ్యాడు. ఈ దశలో ఇతన్నికి చెన్నైలోని ఒక ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.. అయితే కరోనా మహమ్మారి కారణంగా ప్రమాద బాధితులకు చికిత్స అందించలేని పరిస్థితి ఏర్పడటంతో, అయ్యనార్‌ను డిశ్చార్జ్‌ చేసి ఇంటికి పంపించేశారు.

 

 

కాగా ఆరోగ్యపరిస్దితి విషమించడంతో ఇతను శుక్రవారం సాయంత్రం మరణించాడు.. ఇకపోతే అమ్మ, నాన్నమ్మ కరోనా కారణంగా ఆస్పత్రిలో ఉండడం, అసలు తండ్రికి ఏం జరిగిందో అర్ధం కాక ఆ పసిపిల్లవాడు బిక్కుబిక్కుమంటూ రాత్రంతా మృతదేహం పక్కనే నిద్రించాడు.. మరునాడు ఉదయం తన తండ్రిని లేపడానికి ప్రయత్నించగా అతనిలో ఎలాంటి ఉలుకుపలుకు లేకపోవడం చూసి ఆ బాలుడు దీనంగా ఇంటి అరుగు మీద కూర్చున్నాడు. అతని వాలకాన్ని గమనించిన స్దానికుడు ఒకరు ఏమైందని ఆరా తీయగా, పిల్లవాడు అతన్ని లోపలికి తీసుకెళ్లి తన తండ్రిని చూపించగా, అప్పటికే అతను చనిపోయి చాలా సేపు కావడం వల్ల మృతదేహం కుళ్లిపోయిన వాసన వస్తుందన్న విషయం గ్రహించిన స్దానికుడు గ్రామస్తులకు తెలియజేశాడు.

 

 

ఇక ఎన్నో చిక్కుల మధ్య అతని మృతదేహానికి అంత్యక్రియలు చేసేందుకు అనుమతి లభించగా.  కడసారి తన భర్తను చూసుకునేందుకు, అలాగే అతని తల్లికి కూడా చివరి చూపు దక్కడానికి ఎంతో ప్రయాసపడి వలసి వచ్చింది.. చివరికి సేప్టీ డ్రెస్‌తో అంబులెన్స్‌ ఏర్పాటు చేసి దూరం నుంచే అతన్ని చూడవలసి వచ్చింది.. ఒక వైపు తండ్రి మృతదేహాం, మరో వైపు దగ్గరకు రాని తల్లి, నానమ్మ. ఈ సమయంలో ఆ బాలున్ని ఓదార్చడం ఎవరితరం కాలేదు. చూసారా మనకే కష్టాలున్నాయని బాధపడుతూ ఉంటాం.. మనలాగే ఎందరో ఈ కరోనా వల్ల అనుభవించకూడని కష్టాలు అనుభవిస్తున్నారు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: