ప్రపంచంలో కరోనా మహమ్మారి ఎన్ని విషాదాలు మిగుల్చుతుందో ప్రతిరోజూ చూస్తూనే ఉన్నాం.  ఐనవారిని దూరం చేస్తుంది.. స్నేహితులను పక్కకు రానివ్వడం లేదు.  కరోనాకి మందు లేదు.. సోషల్ డిస్టెన్స్ పాటించడం.. మాస్క్ ధరించడం పలు ఆరోగ్యం భద్రతలు పాటించడం ఒక్కటే మార్గం అంటున్నారు.  తాజాగా తమిళనాట ఓ విషాద సంఘటన అందరి హృదయాలను కలచి వేస్తుంది.  అమ్మ, నాన్నమ్మలు కరోనాతో ఆసుపత్రిలో ఉన్న సమయంలోనే తండ్రి ఓ రోడ్డు ప్రమాదం కారణంగా చనిపోయాడు. తండ్రి మృతదేహం వద్దకు ఎవరూ రాకపోవడంతో ఓ పదేళ్ల బాలుడు 14 గంటల పాటు తండ్రి పక్కనే కూర్చుని వెక్కి వెక్కి ఏడుస్తూ.. ఒంటరిగా గడపాల్సి పరిస్థితి ఏర్పడింది. 

 

వివరాల్లోకి వెళితే, విల్లుపురం జిల్లా, కండాచ్చిపురం సమీపంలో అయ్యనార్ (35) కుటుంబం నివాసం ఉంటోంది. అయ్యనార్ భార్య, తల్లికి కరోనా సోకడంతో వారిద్దరూ ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్నారు. ఈ మద్య  అయ్యనార్ రోడ్డు ప్రమాదానికి గురి కాగా, ప్రమాద బాధితులకు చికిత్సను అందించలేమంటూ అతన్ని వైద్యులు డిశ్చార్జ్ చేసి, ఇంటికి పంపగా, పరిస్థితి విషమించి కన్నుమూశాడు. అయితే ఓ వైపు అమ్మ,నాయినమ్మ ఆసుపత్రిలో ఉన్నారు. ఆ చిన్నారి ఒంటగా తండ్రితోనే ఉన్నాడు.  ఆ సమయంలో అటుగా వచ్చిన ఓ వ్యక్తి విషయం తెలుసుకొని అధికారులకు తెలిపారు. కానీ, వారు స్పందించలేదు.

 

ఈ విషయం స్థానిక మీడియాలో రావడంతో, అతనికి అంత్యక్రియలు చేసేందుకు గ్రామస్థులకు అనుమతి లభించింది.   అయ్యనార్ భార్య ప్రాధేయపడగా, సేఫ్టీ డ్రస్, అంబులెన్స్ ఏర్పాటు చేసిన అధికారులు, భర్త వద్దకు అనుమతించారు. కానీ కరోనా భయంతో తల్లి వద్దకు ఆ బాబుని పంపించలేదు.. దాంతో ఓ వైపు తండ్రి మరణం.. తల్లి దూరం ఆ చిన్నారి పడ్డ ఆవేదన అందరికీ కంట తడి పెట్టింది.  ఈ మాయదారి కరోనా ఎన్ని కష్టాలు తెచ్చిపెట్టిందిరా బాబూ అంటూ కన్నీరు పెట్టుకుంటున్నారు.  ఇదొక్కటే కాదు దేశంలో ఇలాంటి కష్టాలు కన్నీళ్లు ఎన్నో ఉన్నాయి.. ఎంతో మంది తమ ఐనవారు చనిపోతు కడచూపు కూడా చూసుకోలేని పరిస్థిలో ఉన్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: