ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌త బెన‌ర్జీకి కేంద్రానికి మ‌ధ్య కోల్డ్‌ వార్ కొన‌సాగుతూనే ఉంది. తాజాగా వలస కార్మికులతో వస్తున్న రైళ్లను మమతా బెనర్జీ ప్రభుత్వం పశ్చిమబెంగాల్‌లోకి రాకుండా అడ్డుకుంటోంద‌ని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా శనివారం ఆ రాష్ట్ర ప్ర‌భుత్వానికి లేఖ రాశారు. మమతా బెనర్జీని ఉద్దేశిస్తూ రాసిన ఆ లేఖలో శ్రామిక్  రైళ్లను అనుమతించకపోవ డంతో వలస కార్మికులు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నార‌ని అన్నారు. ఇలా రైళ్ల‌ను రానివ్వక‌పోవ‌డం అన్న‌ది వ‌ల‌స కార్మికుల‌కు అన్యాయం చేయ‌డం కిందే ప‌రిగ‌ణించాల్సి వ‌స్తుంద‌ని ధ్వ‌జ‌మెత్తారు. ఇదిలా ఉండ‌గా అమిత్‌షా లేఖ‌లో పేర్కొన్న ప‌లు అంశాల‌పై తృణ‌మూల్ కాంగ్రెస్ నాయ‌కులు భ‌గ్గుమ‌న్నారు. 

 

కేంద్ర హోం మంత్రిగా కొన‌సాగుతున్న అమిత్‌షా లాంటి వ్య‌క్తి నిరాధార‌మైన ఆరోప‌ణ‌లు చేయ‌డం సిగ్గుచేటు అంటూ ఘాటుగా స్పందించారు. ఆరోపణలు అమిత్‌షా నిరూపించాలి లేదంటే క్షమాపణలు చెప్పాలి అంటూ  తృణమూల్ కాంగ్రెస్‌ నాయకుడు అభిషేక్‌ బెనర్జీ ట్వీట్ చేయ‌డం గ‌మ‌నార్హం. ఇదిలా ఉండ‌గా కొద్దిరోజుల క్రితం బంగ్లాదేశ‌, నేపాల్ నుంచి కూడా అత్య‌వ‌స‌ర స‌రుకుల ర‌వాణాకు సంబంధించిన ట్ర‌క్కుల‌ను ప‌శ్చిమ బెంగాల్ ప్ర‌భుత్వం అడ్డుకుంటోంద‌ని కేంద్రం సీరియ‌స్ అయిన విష‌యం తెలిసిందే. కేంద్రంలో ఎవ‌రి ప్ర‌భుత్వం కొన‌సాగిన రాష్ట్రంపై ఎంత‌మాత్రం ప్ర‌భావం చూప‌కుండా చూసుకోవ‌డం మ‌మ‌త చాలా జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రిస్తారు.

 

ఆ విష‌యం చాలాసార్లు రుజువైంది. ఇప్పుడు బీజేపీ రాష్ట్రంలో బ‌ల‌ప‌డుతున్న నేప‌థ్యంలో మ‌మ‌త రాజ‌కీయ చ‌ర్య‌లు దేశ వ్యాప్తంగా చర్చంనీయాంశ‌మ‌వుతోంది. త‌ర్వ‌లో జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌ల‌కు ఈ రెండు పార్టీలు ఇప్ప‌టి నుంచి వాగ్బ‌ణాల‌ను సంధించుకుంటుండ‌టం గ‌మ‌నార్హం.  క‌రోనా వేళ బంగా రాష్ట్రంలో జ‌రుగుతున్న రాజ‌కీయ పోరు  ఏ తీరానికి చేరుతుందోన‌ని ప్ర‌జ‌లు పేర్కొంటున్నారు.

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: