కైలాసా మ‌న‌సా స‌రోవ‌రంకు భార‌తీయ యాంత్రికులు వెళ్లేందుకు వీలుగా కేంద్ర ప్ర‌భుత్వం ర‌హ‌దారి నిర్మాణం చేప‌డుతున్న విష‌యం తెలిసిందే. అయితే ర‌హ‌దారిని  లింక్ చేయడానికి నేపాల్ దేశం అభ్యంత‌రం తెల‌ప‌డంతో భార‌త విదేశాంగా శాఖ స్పందించింది. లింక్ రోడ్డు నిర్మాణం పూర్తిగా  భార‌త భూభాగంలో జ‌రుగుతోంద‌ని స్ప‌ష్టం చేసింది. కైలాష్ మన్సరోవర్ యాత్ర యాత్రికుల ఉపయోగం కోసం తెరిచిన రహదారి పూర్తిగా భారత భూభాగంలోనే ఉందని భారత విదేశాంగ శాఖ సమాధానం ఇచ్చింది. కైలాసా మాన‌స రోవ‌ర్ కోసం భార‌త ప్ర‌భుత్వం చేప‌ట్టిన ఈ కొత్త‌ రహదారి వ‌ల్ల 80 కిలోమీటర్ల దూరం త‌గ్గిపోనుంది.

 

ఈ ర‌హ‌దారి చైనా సరిహద్దులో 17,000 అడుగుల ఎత్తులో ఉన్న‌ లిపులేఖ్ పాస్‌ను  క‌లుపుతూ వుంటుంది.  భారతదేశం మరియు నేపాల్  దేశాల మ‌ధ్య  నెల‌కొన్న‌ సరిహద్దు విషయాలను పరిష్కరించడానికి యంత్రాంగాన్ని ఇప్ప‌టికే  ఏర్పాటు చేశామ‌ని, ఎలాంటి వివాదాల‌కు తావులేకుండా ఇరు దేశాలు స్ప‌ష్ట‌త‌తో ముందుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాయ‌ని, దౌత్య సంభాషణల ద్వారా నేపాల్‌తో   సరిహద్దు సమస్యలను పరిష్కరించడానికి భారతదేశం కట్టుబడి ఉంద‌ని కేంద్ర మంత్రిత్వ శాఖ తెలిపింది.

 

ఇదిలా ఉండ‌గా భార‌త్‌కు నేపాల్ న‌మ్మ‌ద‌గిన మిత్ర‌దేశం అంటూ భార‌త ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీ ప‌లుమార్లు ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే.  1994 నుంచి ఇప్పటి వరకూ నేపాల్‌లోని వివిధ సంస్థలకు భారత్‌ 772 అంబులెన్స్‌లు, 142 బస్సులను అందజేసింది. ఆ దేశంలోని విద్య, వైద్య సేవల్లో వీటిని వినియోగిస్తున్నారు. గూర్ఖా సైనికదళానికి చెందిన అమరవీరుల కుటుంబాలకు కూడా మంజీవ్‌ సింగ్‌ నగదు సహాయం అందజేశారు. అలాగే నేపాల్‌లోని 53 పాఠశాలలు, గ్రంథాలయాలకు పుస్తకాలను బహూకరించ‌డం గ‌మ‌నార్హం. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: