రాజకీయాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. పూర్తి స్థాయి రాజకీయ నాయకుడి గా సగానికి పైగా జీవితాన్ని రాకీయలోనే గడిపేసిన నేత గా ఆయనకు గుర్తింపు ఉంది. రాజకీయం అంటే చంద్రబాబు చంద్రబాబు అంటే రాజకీయం అనే విధంగా ఆయన ప్రభావ౦ చూపించే వారు. ఆయన రాజకీయాల్లో చూడని పదవులు ఆయన సాధించని విజయాలు అనేవి ఎన్నో ఉన్నాయి. దీనికి ఆయన తల్లి చాలా కీలకమని చెప్తారు. చంద్రబాబు జీవితంలో తల్లి పోషించిన పాత్ర గురించి ఎంత చెప్పినా తక్కువే అని అంటారు. 

 

ఆయన జీవితంలో రాజకీయాలు నేడు ఏ స్థాయిలో ప్రభావం చూపిస్తున్నాయో ఆయన తల్లి ప్రభావం కూడా ఆయన మీద ఉండేది అని అంటారు. రాజకీయాల్లోకి అడుగు పెట్టాలని ఆయనకు కోరిక ఉన్నప్పుడు... ఆయన తండ్రిని తల్లి ఒప్పించి ఆర్ధిక సహాయం చేయించడమే కాకుండా ఎమ్మెల్యే గా పోటీ చేసిన సందర్భంలో ఆమె అన్ని విధాలుగా అండగా ఉండే వారని ప్రచారం కోసం వచ్చిన వారు అందరికి కూడా ఆమె నుంచి ప్రోత్సాహం ఉండేది అని ఆమె వంటలు వండి వాళ్లకు వడ్డించిన సందర్భాలు ఉన్నాయని అంటారు. 

 

చంద్రబాబు రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలో ఆమె కూడా కొంత భయపడే వారు కాని చంద్రబాబుకి ఉన్న పట్టుదల గురించి బాగా తెలిసిన ఆమె ఆయన గురించి ప్రతీ విషయాన్ని ఎక్కువగా పట్టించుకుని వ్యూహాల్లో కూడా తన వంతు గా సహాయ సహకారాలు అందించిన సందర్భాలు ఉన్నాయి అని చెప్తూ ఉంటారు. ఆయన ఎన్టీఆర్ కి అల్లుడు అయిన సందర్భంలో కూడా తల్లి నుంచి ఎన్నో సలహాలు వచ్చాయని తెలుగుదేశంలో చంద్రబాబు అడుగు పెట్టడానికి కూడా తల్లి ప్రోత్సాహమే చాలా కీలకం అయింది అని అంటూ ఉంటారు ఆయన గురించి బాగా తెలిసిన వాళ్ళు.

మరింత సమాచారం తెలుసుకోండి: