దేశంలో మళ్లీ కొద్దికొద్దిగా నేరాల సంఖ్య పెరుగుతూ వస్తోంది. అలాగే మన హైదరాబాద్ సిటీలో కూడా గత కొద్ది రోజులుగా నేరాల సంఖ్య చిన్నచిన్నగా పెరుగుతూ వస్తోంది. హత్యలు, అత్యాచారాలు, దోపిడీలు ఇలా రోజు రోజుకి చిన్నగా పెరుగుతుండడంతో ప్రజల్లో భయం, ఆందోళన మొదలవుతుంది. అయితే తాజాగా చాదర్ ఘాట్ ప్రాంతంలో అబ్దుల్ రెహమాన్ అనే వ్యక్తిని గుర్తుతెలియని వ్యక్తులు నలుగురు దారుణంగా చంపేశారు. చాదర్ ఘాట్ కు చెందిన రహమాన్ ని అజమ్‌ పుర ప్రాంతంలో శనివారం రాత్రి TS 09 FH 5856 నెంబర్ గల కారులో వచ్చిన నలుగురు వ్యక్తులు అతడిని చుట్టుముట్టారు. ఆ తర్వాత అతన్ని కత్తులతో విచక్షణారహితంగా నరికి వెళ్లిపోయారు.

 


ఆ తర్వాత అక్కడి స్థానికులు తీవ్ర రక్తస్రావంతో బాధపడుతున్న రెహమాన్ దగ్గరలోని ప్రైవేట్ హాస్పిటల్ కు చేర్చగా అప్పటికే అతను చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఇక ఈ విషయంపై సమాచారం అందుకున్న చాదర్ ఘాట్ పోలీసులు కేసు నమోదు చేసి పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి పరారైన నలుగురు వ్యక్తులను పట్టుకునేందుకు ముమ్మరంగా దర్యాప్తు చేపట్టారు పోలీసులు. ఈ క్రమంలోనే వారిని పట్టుకోవడానికి గాలింపు చర్యలను ముమ్మరం చేశారు పోలీసులు. సంఘటనా స్థలంలోని సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా ఈ హత్యకు పాల్పడిన నలుగురిని పట్టుకునేందుకు పోలీసులు నిందితులను గుర్తించేందుకు ప్రయత్నం చేస్తున్నారు.

 


అయితే రెహమాన్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్ కి పంపడం జరిగింది. ప్రస్తుతం నగరంలో లాక్ డౌన్ సందర్భంగా ఎక్కడికక్కడ పోలీసులు తనిఖీలు చేపడుతూ బందోబస్తు నిర్వహిస్తున్న సమయంలో నడిరోడ్డులో ఇలాంటి సంఘటన జరగడం హైదరాబాద్ నగరంలో పెద్ద కలకలం సృష్టిస్తోంది. అయితే పోలీసుల కథనం మేరకు రెహమాన్ ను పక్క ప్లాన్ చేసి చంపారని 
 వారు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: